ప్రముఖ ఈ-కామర్స్ ప్లేయర్ మీషో హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. ఇదిలా ఉండగా, తమ ఇంటర్నెట్ ఈ -కామర్స్ కంపెనీ మీషో ఆరు లక్షల విక్రేతల రిజిస్ట్రేషన్స్‌ను తమ ప్లాట్‌ఫాంపై అధిగమించినట్లు తెలిపింది. ఏప్రిల్ 2021 తర్వాత ఏడురెట్ల వృద్ధి నమోదు చేసింది. భారీ సంఖ్యలో చిరు వ్యాపార సంస్ధలు గత ఏడాది కాలంలో మీషోలో చేరాయి. దీనికి పరిశ్రమలో తొలిసారిగా కంపెనీ ప్రారంభించిన ప్రోగ్రామ్స్ జీరో కమీషన్ అండ్ జీరో పెనాల్టీ తోడ్పడినాయి. ఈ విక్రేతల్లో దాదాపు సగంమంది కేవలం మీషోపై మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా చిరు, మధ్య తరహా వ్యాపార సంస్ధలకు ప్రాధాన్యతా ఈ-కామర్స్ వేదికగా నిలిచింది మీషో.
హైదరాబాద్‌లో ఈ ప్లాట్‌ఫాంపై విక్రేతల సంఖ్యాపరంగా అత్యంత ఆకర్షణీయంగా ఆరు రెట్ల వృద్ధి నమోదయింది. దీంతో పాటు మే 2021 నుండి ఆర్డర్స్ సంఖ్య పరంగా ఏడురెట్ల వృద్ధి కనిపించింది. హైదరాబాద్‌లో అత్యధికంగా విక్రయించబడిన విభాగాలలో అప్పారెల్స్, ఆభరణాలు, హోమ్ డెకార్, ఫర్నిషింగ్, వ్యక్తిగత సంరక్షణ, వెల్‌నెస్ తదితరాలు ఉన్నాయి.

అమృత్‌సర్, రాజ్‌కోట్, తిరుప్పూర్ వంటి నగరాల నుండి కూడా మీషోలో ఉన్నారు. కంపెనీ దాదాపు లక్షల మంది చిరు వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా మారింది. భారీ సంఖ్యలో వైవిధ్యమైన అభిరుచులు కలిగిన వినియోగదారులను చేరుకోవడం ద్వారా విక్రేతల సంపాదనా సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. మీషో సీఈవో అండ్ ఫౌండర్ మాట్లాడుతూ పెట్టుబడిదారుల అంచనాలు మారిపోయాయని, ప్రజలు ఇప్పుడు లాభదాయక వృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు.
More From GoodReturns

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications