Time's list: 2023కి గాను అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను టైమ్స్ విడుదల చేసింది. ఇందులో రెండు భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో ఒకటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం మీషో కాగా మరొకటి దేశం గర్వించదగ్గ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).
2008లో రిజర్వ్ బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ద్వారా NPCI స్థాపించబడింది. దేశంలో బలమైన చెల్లింపు వ్యవస్థలను రూపొందించడం కోసం దీనిని ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో.. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని NPCI వాడుకలోకి తీసుకొచ్చింది. తద్వారా కేవలం నగదుతో మాత్రమే చెల్లింపులు చేసే మన దేశంలో.. ఈ-కామర్స్ వృద్ధికి వీలు కల్పించింది అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.

ఇక విదిత్ ఆత్రే మరియు సంజీవ్ బర్న్‌వాల్ చే 2015లో మీషో ప్రారంభించబడింది. బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. 2022 ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన షాపింగ్ యాప్ గా రికార్డు సృష్టించింది. అమెజాన్ మరియు వాల్‌మార్ట్ ధరలతో వివిధ వస్తువులను వినియోగదారులను అందిస్తుంది అని టైమ్ వెల్లడించింది. 2025 నాటికి దేశంలో ఇ-కామర్స్ అమ్మకాలు దాదాపు రెట్టింపై 133 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని భావిస్తోంది.
ఇవిగాక పాలిగాన్ ల్యాబ్స్, చిప్‌మేకర్ Nvidia, Elon Musk's SpaceX, Apple, Sam Altman's OpenAI, పాదరక్షల తయారీదారు Crocs, Samsung, Microsoft మరియు లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LVMHలు ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఇతర ప్రముఖ కంపెనీలు.


Click it and Unblock the Notifications