Meesho News: ఉద్యోగులకు 9 రోజులు పెయిడ్ హాలిడే.. పనికి దూరంగా ఎంజాయ్ చేయాలని విజ్ఞప్తి
Meesho Holidays: ఇ-కామర్స్ వ్యాపారంలో వేగంగా వృద్ధిని సాధించి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలకు గట్టిపోటీని ఇస్తోంది మీషో. అయితే కంపెనీ ప్రస్తుతం తన ఉద్యోగులకు రీసెట్ అండ్ రీఛార్జ్ పేరుతో 9 రోజులు సెలవును అందిస్తోంది. కంపెనీ వరుసగా 4వ ఏటా ఇలా ఉద్యోగులకు శెలవులు ఇవ్వటంపై సోషల్ మీడియాలో యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీషో సంస్థ కంపెనీ వ్యాపాతంగా ఉద్యోగులకు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 వరకు సెలవులో ఉండాలని తెలిపింది. ఈ తొమ్మిది రోజుల సమయంలో ఉద్యోగులు కంపెనీకి సంబంధించిన మెయిల్స్, కాల్స్, స్లాక్ మెసేజెస్, మీటింగ్స్ సహా అన్నింటికి దూరంగా గడపాలని తెలిపింది. ఉద్యోగులు తమ పనికి దూరంగా కొంత సమయాన్ని ఇష్టమైన వారితో గడపటం చాలా కీలకంగా కంపెనీ చెబుతోంది. ఇలా సెలవులు తీసుకుని పనికి దూరంగా ఉండటం వల్ల ప్రాముఖ్యతపై లింక్డ్ ఇన్ పోస్టులో కూడా పేర్కొంది. రెస్ట్ అండ్ రీఛార్జ్ సమయంలో ఆఫీసు పనులకు దూరంగా ఉండాలని సూచించింది.

బ్లాక్‌బస్టర్ సేల్స్ ఈవెంట్‌తో కూడిన విజయవంతమైన సంవత్సరం తర్వాత, మీషో ఉద్యోగుల శ్రేయస్సు కోసం తన అంకితభావాన్ని వ్యక్తం చేసింది. ఉద్యోగులు ప్రస్తుతం పని నుంచి అన్ ప్లగ్ కావాల్సిన సమయం ఆసన్నమైంది, ఈ బ్రేక్ రానున్న ఏడాదిని కొత్తగా, ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేయటానికి శరీరాన్ని మనసును రీఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చాలా మంది నుంచి ఆమోదాన్ని పొందింది. తొమ్మిది రోజుల విరామం ఇవ్వాలనే నిర్ణయం మీషో తన ఉద్యోగులకు విలువనిస్తుందని, వారిలో చైతన్యం నింపి కొత్త దృక్పథంతో తిరిగి రావడానికి దోహదపడతాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు యూజర్లు ఇలాంటి కంపెనీలో పనిచేయాలని ఉందని పేర్కొంటున్నారు. అన్ని పరిశ్రమలలోని ప్రస్తుత హస్టిల్-టైప్ వర్క్ కల్చర్‌లో నేను దీనిని ఊహించలేతున్నానని, దీనికి మీషో పెద్ద ఉదాహరణగా నిలవాలని అభిప్రాయపడ్డాడు. పూర్తిగా వ్యక్తులు తమపై ఫోకస్ చేసేందుకు 9 రోజులు విరామ సమయాన్ని కంపెనీ అందించటం నేటి కార్పొరేట్ ప్రపంచంలో అతిపెద్ద మార్పుకు శ్రీకారంగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు ఉద్యోగుల మెంటల్ హెల్త్ పై ఫోకస్ పెట్టే ఇలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు. ఎప్పటికీ ముగియని పని అనే పరుగుపందెంలో విరామం చాలా కీలకంగా నేటితరం యువత భావిస్తోంది. కంపెనీలు సైతం దీని ప్రాముఖ్యతను గుర్తించాలని వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications