ఐరోపాకు చెందిన ఆరోగ్య, వైద్య పరీక్షల సంస్థ మెడికవర్ గ్లోబల్ తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఆసుపత్రులను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాదులో ఓ హాస్పిటల్‌ను నిర్వహిస్తోన్న ఈ సంస్థ తాజాగా నెల్లూరులో 250 బెడ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించింది. 100 పడకలతో అంతర్జాతీయ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు
మెడికవర్ సంస్థ దేశీయంగా ఈక్విటీ, డెట్ రూపాల్లో రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. క్యాన్సర్ ఆసుపత్రి సహా ఇతర ప్రాజెక్ట్స్ కోసం మరో రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మెడికవర్ సీఈవో ప్రెడ్రిక్ రాగ్‌మార్గ్ పేర్కొన్నారు. 2020 డిసెంబర్ లోగా హైదరాబాద్‌లో 500 బెడ్స్ కలిగిన హాస్పిటల్‌ని తీసుకునే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.

విశాఖ, శ్రీకాకుళంలోను..
విశాఖపట్నంలో 200 బెడ్స్, శ్రీకాకుళంలో 300 బెడ్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరులో 250 బెడ్స్ కలిగిన హాస్పిటల్ కోసం రూ.150 కోట్ల వరకు వెచ్చించింది. దీనిని 750 బెడ్స్ స్థాయికి మార్చనున్నారు. ఇక్కడే రూ.30 కోట్లతో 100 బెడ్స్ కలిగిన అత్యాధునిక అంకాలజీ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు.

త్వరలో మరో 2,000 మంది ఉద్యోగులు
మెడికవర్ ఇండియా చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో తమ సంస్థ ఆసుపత్రులను కలిగి ఉందని చెప్పారు. 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని, త్వరలో మరో 2,000 మందిని నియమించుకుంటామని చెప్పారు. 2,300 మంది స్థానిక ఆరోగ్య సేవల ప్రొవైడర్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు.

అనంత, కడపల్లోను..
ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకు మరిన్ని పెట్టుబడులు పెడతామని తెలిపింది. విశాఖలో తన కేంద్రాలను మూడుకు పెంచుకోనుంది. మెడికవర్‌కు అన్ని రాష్ట్రాల్లో కలిపి 2,500 బెడ్స్ కలిగిన హాస్పిటల్స్ ఉన్నాయి. అనంతపురం, కడపలోను ఏర్పాటు చేయనుంది.
More From GoodReturns

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications