కొత్త సంవత్సరం (2026) వస్తుందంటే కొత్త లక్ష్యాలతో పాటు కొత్త ఖర్చులు కూడా వస్తాయి. అయితే ఉద్యోగాలు చేసేవారు మాత్రం ఈసారి తమ ఆరోగ్య ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలోని ప్రముఖ సర్వీసెస్ సంస్థ 'అయాన్' (Aon) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఉద్యోగుల మెడికల్ ప్లాన్ ఖర్చులు సుమారు 11.5% పెరిగే అవకాశం ఉందట.

గత రెండు సంవత్సరాలుగా మెడికల్ ట్రెండ్ రేట్స్ పెరుగుదల చాలా వేగంగా ఉంది. ప్రపంచ సగటు (9.8%) కంటే కూడా ఎక్కువగానే ఉంది. అంటే ప్రపంచంలోని ఇతర ఉద్యోగుల కంటే మన దేశ ఉద్యోగులు హెల్త్ కేర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఖర్చు పెంచుతున్న మూడు వ్యాధులు..
ఈ ఖర్చుల భారాన్ని ముఖ్యంగా మూడు రకాల ఆరోగ్య సమస్యలు పెంచుతున్నాయి. ఇవి 2026లో క్లెయిమ్స్‌పై వైద్య ఖర్చులపై అత్యధిక ప్రభావాన్ని చూపనున్నాయి. అవేంటంటే..
- గుండె జబ్బులు& రక్తపోటు (Cardiovascular Disease & Hypertension): గుండె, రక్తనాళాల సమస్యలు, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఇప్పటికీ అత్యధిక వైద్య ఖర్చులకు ప్రధాన కారణంగా ఉన్నాయి.
- జీర్ణశయ రుగ్మతలు (Gastrointestinal Conditions): జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఖర్చును పెంచుతున్నాయి.
- క్యాన్సర్ (Cancer): ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్యాన్సర్ చికిత్స ఖరీదైనదిగా మారి క్లెయిమ్‌లను పెంచుతోంది.
వైద్య ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి?
Medical Trend Rate India పెరుగుదలకు కేవలం వ్యాధులు మాత్రమే కారణం కాదు. వైద్య రంగంలో వస్తున్న మార్పులు కూడా ఈ భారాన్ని పెంచుతున్నాయి..
- కొత్త టెక్నాలజీ, ఖరీదైన చికిత్సలు: అధునాతన వైద్య చికిత్సలు, రోబోటిక్స్, AI టెక్నాలజీల వినియోగం పెరగడం వల్ల వాటి ఖర్చు అధికంగా ఉంటోంది.
- కొత్త మందులు: ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధులకు (Chronic Diseases) కనుగొంటున్న కొత్త మందులు చాలా ఖరీదైనవిగా ఉంటున్నాయి.
- నాణ్యత లోపం: పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా నాణ్యమైన హాస్పిటల్స్, నైపుణ్యం ఉన్న వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్ల సేవలకు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది.
- ప్రీమియంల పెరుగుదల: వైద్య ఖర్చులు, క్లెయిమ్‌లు పెరగడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఆరోగ్య బీమా ప్రీమియంలను పెంచేస్తున్నాయి.
కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగులు ఏం చేయాలి?
ఈ ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ఇండియాలోని కంపెనీలు కొన్ని కీలక మార్పులు చేస్తున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా హెల్త్‌కేర్ ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కేవలం జబ్బు వచ్చిన తర్వాత చికిత్స కాకుండా.. జబ్బు రాకుండా నివారించడానికి డైట్ సర్వీసులు, వెయిట్ మేనేజ్ మెంట్ (Weight Management), వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇన్సూరెన్స్ డేటాను ఉపయోగించి ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందో విశ్లేషించి ఆ ఖర్చును తగ్గించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి.
ఇలా చేస్తే సేఫ్..
కంపెనీలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగులు కూడా తమ ఆరోగ్యాన్ని ఒక విలువైన పెట్టుబడిగా చూడాలి. బరువు అదుపులో ఉంచుకోవడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో వైద్య ఖర్చులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన వ్యాధులకు దారితీసే ప్రధాన కారకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పోషకాహార లోపం (Poor Nutrition). కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త వహించాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications