5 లక్షల ఉచిత టూరిస్ట్ వీసా స్కీం: మెడికల్ టూరిజానికి బూస్ట్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యలను ప్రకటించారు. వైద్య రంగానికి రూ.50వేల కోట్లు కేటాయించారు. పర్యాటక రంగంపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు ట్రావెల్ ఏజెన్సీలకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.10 లక్షల వరకు, టూరిస్ట్ గైడ్‌లకు రూ.1 లక్ష వరకు వ్యక్తిగత రుణం ఇస్తారు.
రిజిస్టర్ చేసుకున్న టూరిస్ట్ గైడ్స్, పర్యాటక రంగంపై ఆధారపడిన వారికి 11,000 మందికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రధానంగా మొదటి ఐదు లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసాలు అందిస్తామని, వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. ఇది మెడికల్ టూరిజం రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు.

కరోనా కారణంగా రవాణా పరిమితులు విధించడంతో టూరిజం, మెడికల్ టూరిజం పైన భారీ ప్రభావం పడింది. అయితే తాజా చర్యలు మెడికల్ టూరిజం ఊపందుకోవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. మెడికల్ టూరిస్ట్‌లకు ఇది ఎంతో ప్రయోజనకరమని, ఇప్పటి వరకు మెడికల్ టూరిజాన్ని కరోనా దారుణంగా దెబ్బతీసిందని కోల్‌కతాకు చెందిన మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రతినిధి ఒకరు చెప్పారు.
'వీసా జారీ తిరిగి ప్రారంభమయ్యాక, మొదటి 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా ఇస్తాం. ఒక వ్యక్తికి ఈ అవకాశం ఒకేసారి ఉంటుంది' అని నిర్మలమ్మ చెప్పారు. ఈ స్కీం మార్చి 31, 2022 వరకు ఉంది. మార్చి వరకు ఉంటుందన్నారు. మార్చి 31, 2022 లేదా 5 లక్షల మందికి వీసా ఏది ముందు పూర్తయితే అది అన్నారు.


Click it and Unblock the Notifications