సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు ఈ మధ్య పెట్టుబడులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ప్రతినెలా మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెరుగుతూ పోతున్న ఇన్‌ఫ్లో గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇదే విషయంపై Edelweiss మ్యూచువల్ ఫండ్ CEO రాధికా గుప్తా మాట్లాడారు. SIPని ఖర్చుగా చూడకూడదని, భవిష్యత్తు కోసం పెట్టుబడిగా చూడాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్స్ ఆశించిన స్థాయిలో పని చేయకపోవచ్చనే ఆందోళన ఉందన్నారు. అయితే అవి దీర్ఘకాలిక పెట్టుబడి అని గుర్తించాలని గుర్తుచేశారు. మొదట భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత ఇతర ఖర్చుల గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ మేరకు రాధికా పోస్ట్ చేశారు. 'మొదట మెర్సిడెస్ తరువాత మందులు. SIPల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ చిన్న దిద్దుబాటు. SIP అనేది ఖర్చు కాదు, భవిష్యత్తు కోసం పెట్టుబడి. భారతీయులూ పెట్టుబడులు పెట్టండి' అని కోరారు. మార్చి 2024లో ఇండియన్స్ SIP ఇన్వెస్ట్‌మెంట్స్ నెలవారీ మందుల ఖర్చును అధిగమించిందని ఓ వినియోగదారు చేసిన పోస్టుపై ఆమె ఈ విధంగా స్పందించారు.
మార్చి 2024కి ముందు భారతీయులు మానసిక ప్రశాంతత కంటే ప్రతి నెలా ఫార్మాస్యూటికల్స్‌పైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆ పోస్ట్ సూచిస్తోంది. దేశీయ ఔషధ విక్రయాల కంటే నెలవారీ SIP విరాళాలు స్థిరంగా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ పరంగా చెప్పాలంటే దాల్-చావల్ పెట్టుబడి అంటూ తాను గతంలో చేసిన పోస్ట్ ఒక పదబంధంగా ప్రజల్లో వైరల్ అవుతుండటం పట్ల రాధికా హర్షం వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications