Swiggy News: అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఇండియన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. ఇప్పటివరకు భారతీయ మార్కెట్లో మెజారిటీ వాటాను దక్కించుకుని మరింత వృద్ది సాధిస్తోంది. అయితే ఈ మధ్య దాని హవాకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న క్విక్ కామర్స్ ప్లాట్ ఫారమ్స్ అని అంచనాలు ఉన్నాయి.
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో వాటా కొనుగోలు చేయాలని ఫ్లిప్‌కార్ట్ గతంలో భావించింది. వాల్యుయేషన్ అసమతుల్యత కారణంగా ఆ చర్చలు విఫలమయ్యాయి. క్విక్ కామర్స్ ప్లాట్ ఫారమ్స్ జెప్టో మరియు బ్లింకిట్ వంటి సంస్థలను చేజిక్కించుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు జరిగినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. అయితే అలాంటి చర్చలు ఏమీ జరగలేదని స్విగ్గీ ప్రతినిధి ఈ వార్తలను కొట్టిపారేశారు.

స్విగ్గీలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా ఉన్న దక్షిణాఫ్రికా గ్రూప్ ప్రోసస్ ఈ చర్చల్లో భాగంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆ గ్రూప్‌కు చెందిన డచ్-లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగం స్విగ్గిలో సుమారు 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది. కాగా ఇది తన హోల్డింగ్‌ను ప్రస్తుతం ఉన్న 33 శాతం నుండి 26 శాతానికి కుదించాలని ప్రయత్నిస్తోంది. లేని పక్షంలో భారతీయ నిబంధనల ప్రకారం స్విగ్గీ IPOగా వచ్చే వేళ ప్రోసస్ కంపెనీ 'ప్రమోటర్'గా ట్యాగ్ చేయబడుతుంది.
జనవరి 2022లో నిర్వహించిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ రౌండ్ తర్వాత స్విగ్గీ వాల్యుయేషన్ 10.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాని సమీప ప్రత్యర్థి జొమాటో 20 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉంది. 2021లో ఇండియన్ మార్కెట్‌లో లిస్ట్ కాబడగా.. మూడేళ్లలో దీని షేర్లు 59 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. 10 వేల 400 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం స్విగ్గీ షేర్‌హోల్డర్ల ఆమోదాన్ని పొందింది. అనంతరం ఏప్రిల్‌లో స్విగ్గీ IPO దరఖాస్తును మార్కెట్ రెగ్యులేటర్‌కి దాఖలు చేసింది.


Click it and Unblock the Notifications