Billionaire Doctor: ఓ సాధారణ డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన వైద్యుడు ప్రస్తుతం ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో నిలిచారు. మెడికల్ రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఇప్పటికే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న డా.నరేష్ ట్రెహాన్ గురించే. దేశంలో ఆయన మెడికల్ గ్రూప్‌ను నిర్మించారు. దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్. 77 ఏళ్ల వయసులో కూడా వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. పైగా ఆయన మేదండ హాస్పిటల్ గ్రూప్ చైర్మన్, వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2023లో ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేర్చబడ్డారు.

వైద్యుల కుటుంబం నుంచి వచ్చి నరేష్ ట్రెహాన్ తల్లి గైనకాలజిస్ట్, ఆయన తండ్రి ఈఎన్టీ డాక్టర్. దీంతో చిన్నప్పటి నుంచే ఆయనపై వైద్య రంగం గురించి అనుభవం ఏర్పడింది. చిన్న వయస్సులోనే దేశంలో పెద్ద వైద్య బృందాన్ని నిర్మించాలనే ఆశయం కలిగి ఉన్నాడు. 1963లో లక్నోలోని జార్జ్ మెడికల్ కాలేజీలో చేరి చదువు పూర్తి చేసిన నరేష్ 1969లో అమెరికా వెళ్లారు. అక్కడ అతను థామస్ జెఫెర్సన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు.
ఆ తర్వాత నరేష్ 1988లో భారత్ తిరిగి వచ్చారు. మొదట అపోలో హాస్పిటల్స్‌లో తన పనిని ప్రారంభించారు. తర్వాతి కాలంలో 2007లో హర్యానాలోని అతిపెద్ద మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటైన ది మెడిసిటీని మేదండా స్థాపించారు. తాజాగా ఆయన రూ.11,680 కోట్లు నికర విలువతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో అతను 2287వ స్థానంలో నిలిచారు. ఆయనకు గుండే సర్జన్‌గా 50 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉంది. ఇప్పటి వరకు 48 వేల ఓపెన్ హార్ట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.
అతని కంపెనీ 2022లో గ్లోబల్ హెల్త్ పేరుతో స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.35,926 కోట్లుగా ఉంది. కంపెనీ ఉత్తర భారతదేశంలో ఐదు ఆసుపత్రులను స్థాపించి నిర్వహిస్తోంది. మెదాంత మెడికల్ గ్రూప్‌లో నరేష్‌కు 33.6% వాటా ఉంది.


Click it and Unblock the Notifications