Banking News: ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం అయిపోయింది. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కొన్ని పెద్ద ట్రాన్సాక్షన్ల విషయంలో అడపాదడపా చెక్కులను వినియోగిస్తున్నారు. కానీ గతంలో అయితే వీటిని విరివిగా వాడేవారు. వీటికి సంబంధించిన పలు మోసాల కేసులు కూడా కోర్టుల్లో సాగుతూ ఉన్నాయి. చెక్కులు జారీకి సంబంధించి కొన్ని నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎవరికైనా నగదు పంపించాల్సి వస్తే బ్యాంకుకు వెళ్లకుండా, అకౌంట్లో లాగిన్ అవ్వకుండా సింపుల్‌గా చెల్లించే పద్ధతి చెక్కు. ఖాతాదారుని పేరు, నగదు మొత్తం, తేదీ, సంతకం ఉంటే చాలు. ఏ వ్యక్తికైనా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. సదరు గ్రహీత ఆ చెక్కును బ్యాంకుకు సబ్మిట్ చేయడం ద్వారా నగదుగా మార్చుకోవచ్చు లేదా తన ఖాతాలో జమపడే విధంగా బ్యాంకును కోరవచ్చు.

అయితే ఇలా చెక్కు రాయడంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. చెక్కులపై చిన్న గీతలు గీయడం ద్వారా బ్యాంకులకు డైరెక్టుగా ఆదేశాలు ఇవ్వవచ్చు. చెక్కుకు ఎడమవైపు పైభాగాన రెండు సమాంతర గీతలను గీస్తుండటం చూడవచ్చు. చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్లిన వారి అకౌంట్లో మాత్రమే ఆ నగదును జమ చేయాలి అని దాని అర్థం. మరికొన్ని సార్లు ఆ రెండు సమాంతర లైన్ల మధ్యలో 'AC payee only' అని ఉంటుంది. చెక్కుపై పేరు రాసి ఉన్న వ్యక్తి మాత్రమే తన ఖాతాకు ఆ నగదును బదిలీ చేపించుకొని డబ్బు తీసుకోగలరు.
పై రెండు సందర్భాల్లో తేడా ఏంటి అంటే.. కేవలం రెండు గీతలు మాత్రమే గీసిన చెక్కును సదరు గ్రహీత వేరొకరికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మూడో వ్యక్తి డబ్బు తీసుకోవచ్చు కానీ 'AC payee only' అని రాస్తే మాత్రం కచ్చితంగా ఆ పేరు రాయబడిన వ్యక్తి మాత్రమే ఆ చెక్కును ఉపయోగించి నగదు పొందగలరు. లేని పక్షంలో బ్యాంకులు ఆ చెక్కును ప్రాసెస్ చేయడానికి నిరాకరిస్తాయి.


Click it and Unblock the Notifications