పెట్టుబడిదారులకు నమ్మకమైన ఆస్తిగా నిలిచే బంగారం.. నేడు (జనవరి 23, 2026) చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్ లో పసిడి ధరలు ఉరుకులు పెడుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే డాలర్ బలహీనపడటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం (gold) పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి.

MCX మార్కెట్‌లో భారీ పెరుగుదల
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఒక్కసారిగా దాదాపు రూ. 2,900 (సుమారు 2%) పెరిగి, 10 గ్రాములకు రూ. 1,59,226 వద్ద ఆల్ టైమ్ హై రికార్డును తాకింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ. 12,600 (సుమారు 4%) మేర దూసుకుపోయి, కిలోకు రూ. 3,39,927 వద్ద సరికొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది.
అంతర్జాతీయ కారణాలు: డొనాల్డ్ ట్రంప్, గ్రీన్ ల్యాండ్ వివాదం
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. నాటో (NATO)తో జరిగిన ఒప్పందంలో గ్రీన్లాండ్‌పై అమెరికాకు పూర్తి ప్రాప్యత లభించిందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్ నాయకులు దీనిపై స్పష్టత లేదని వాదిస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు తమ నిధులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు.
డాలర్ బలహీనత & ఫెడ్ నిర్ణయాలు
అమెరికా డాలర్ ఇండెక్స్ గత రెండు వారాల కనిష్టానికి పడిపోవడం కూడా బంగారం ధరలు (gold rates) పెరగడానికి దోహదపడింది. డాలర్ విలువ తగ్గితే ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు వచ్చే వారం జరగనున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశంపై అందరి కళ్లు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల సంకేతాలు వస్తాయన్న అంచనాలు పసిడికి మరింత ఊపునిస్తున్నాయి.
ముఖ్యమైన స్థాయిలు: నిపుణుల సలహా
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. బంగారం, వెండికి కింది స్థాయిలు కీలకం కానున్నాయి:
• గోల్డ్ సపోర్ట్: రూ. 1,54,400, రూ. 1,52,800.
• రెసిస్టెన్స్: రూ. 1,58,500, రూ. 1,62,000.
• సిల్వర్ సపోర్ట్: రూ. 3,24,000.
• రెసిస్టెన్స్: రూ. 3,44,000.
మొత్తానికి ప్రస్తుత పరిస్థితిలో ధరలు తగ్గిన ప్రతిసారి బంగారం కొనుగోలు చేయడం (Buy on Dip) లాభదాయకంగా ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. బంగారం ధర త్వరలోనే రూ. 1.70 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరైన సలహాదారుడి సూచన మేరకు తగిన నిర్ణయం తీసుకోండి.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అంశాలు సంబంధిత వ్యక్తుల లేదా విశ్లేషకుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి " Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited " అధికారిక సలహాలు కావు. ఇందులో సమాచారం యొక్క ఖచ్చితత్వానికి మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వము. మేము స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలు లేదా కొనుగోలు/అమ్మకాల సిఫార్సులు చేయము. ఈ కథనాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఉద్దేశించినవి. కాబట్టి, మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications