Layoffs News: వందల మందికి అమెరికన్ కంపెనీ లేఆఫ్స్.. సరికొత్త విధానంలో సిబ్బందికి ఉద్వాసన
New layoff proposal: దాదాపు గత రెండేళ్లుగా లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. అంతకంతకూ తొలగింపులకు గురవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వివిధ కంపెనీలు ఈ జాబితాలో యాడ్ అవుతున్నాయి. తాజాగా మరో అమెరికన్ దిగ్గజ కంపెనీ భారీ స్థాయిలో తన సిబ్బందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.
గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే వందలాది మంది సీనియర్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. కంపెనీని విడిచి ఇతర ఉద్యోగాల కోసం వెతకాలనుకునే వారికి చెల్లింపును సైతం ఆఫర్ చేసింది. ఎందుకంటే పరిశ్రమ వ్యాప్తంగా ఏర్పడిన మాంద్యం పరిస్థితుల్లో హెడ్‌కౌంట్‌ను తగ్గించడానికి మెకిన్సే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

UK బిజినెస్ సెగ్మెంట్‌లోని మేనేజర్స్‌కి మెకిన్సే ఓ గొప్ప ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 9 నెలల పాటు 'జాబ్ సెర్చ్'కి సమయం ఇవ్వనున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ టైంలో సదరు ఉద్యోగులు క్లయింట్ ప్రాజెక్ట్‌లలో పాల్గొనకుండా కొత్త ఉపాధి అవకాశాలను వెతకడానికి పని గంటలను ఉపయోగించవచ్చని తెలిపింది.
వారికి పూర్తి జీతాన్ని ఇవ్వడం కొనసాగిస్తామని మెకిన్సే తన ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఈ సమయంలో ఆ సిబ్బంది కంపెనీ వనరులతో పాటు కెరీర్ కోచింగ్ సేవలకు కూడా యాక్సెస్ కలిగి ఉంటారు. అయితే ఆ 9 నెలల వ్యవధిలో కొత్త ఉద్యోగాన్ని కనుగొనలేకపోయినప్పటికీ సదరు సిబ్బంది సంస్థను విడిచిపెట్టవలసి ఉంటుంద కండీషన్ పెట్టినట్లు నివేదిక వెల్లడించింది.
మెకిన్సే 2023లోనూ తన శ్రామిక శక్తిని తగ్గించడానికి ప్రయత్నించింది. సుమారు 1,400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. తద్వారా 3 శాతం సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 3 వేల మందికి పేలవమైన పనితీరు రేటింగ్ ఇచ్చింది. పనితీరు మెరుగుపరచడానికి 3 నెలల సమయం ఇచ్చి, లేని పక్షంలో కంపెనీని విడిచిపెట్టవచ్చని ఉద్యోగుల ముందు ఆప్షన్ పెట్టినట్లు నివేదిక జోడించబడింది.


Click it and Unblock the Notifications