For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.53 లక్షల కోట్లు పతనం

|

టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.53 లక్షల కోట్లు క్షీణించింది. సోమవారం స్వల్పంగా లాభపడిన మార్కెట్లు, ఆ తర్వాత వరుసగా భారీగా పతనమైన విషయం తెలిసిందే. సెన్సెక్స్ మంగళవారం 554 పాయింట్లు, బుధవారం 656 పాయింట్లు, గురువారం 634 పాయింట్లు, శుక్రవారం 427 పాయింట్లు పడిపోయింది. అంటే నాలుగు రోజుల్లోనే 2285 పాయింట్లకు పైగా పతనమైంది. సెన్సెక్స్ 3.57 శాతం, నిఫ్టీ 638 పాయింట్లు లేదా 3.49శాతం తగ్గింది. గత వారం సెన్సెక్స్ 61,300 పాయింట్లకు పైన ప్రారంభమై, ఇప్పుడు 59,000 పాయింట్ల స్థాయిలో ముగిసింది. కేవలం 4 రోజుల్లోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.9.73 లక్షల కోట్లు క్షీణించి, రూ.280 లక్షల కోట్ల నుండి రూ.270 లక్షల కోట్లకు పడిపోయింది. బెంచ్ మార్క్ సూచీలు గతవారం 4 శాతం మేర క్షీణించింది. FPI ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కనిపించింది.

- ఈసారి టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,53,394.63 కోట్లు తగ్గింది.

- ఈసారి టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,53,394.63 కోట్లు తగ్గింది.

- ఈసారి టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,53,394.63 కోట్లు తగ్గింది.

- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,974.25 కోట్లు తగ్గి రూ.16,76,291.69 కోట్లకు పడిపోయింది.

- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,09,498.10 కోట్లు పడిపోయి రూ.14,18,530.72 కోట్లకు తగ్గింది.

- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.60 వేల కోట్ల వరకు తగ్గి రూ.7,51,144.40 కోట్లకు చేరుకుంది.

- బ్యాంకింగ్ దిగ్గజాలు HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, SBI.. ఈ మూడింటి మార్కెట్ క్యాప్ రూ.29,239.04 కోట్లు క్షీణించింది.

- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,563.15 కోట్లు తగ్గి రూ.8,42,876.13 కోట్లకు పడిపోయింది.

- SBI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,863.91 కోట్లు తగ్గి రూ.4,48,729.47 కోట్లకు చేరుకుంది.

- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,811.98 కోట్లు తగ్గి రూ.5,58,699.39 కోట్లకు పడిపోయింది.

వీటి మార్కెట్ క్యాప్ కూడా..

వీటి మార్కెట్ క్యాప్ కూడా..

- హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.9,938.77 కోట్లు తగ్గి రూ.5,45,622.08 కోట్లకు క్షీణించింది.

- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.27,653.67 కోట్లు నష్టపోయి రూ.4,45,033.13 కోట్లకు చేరుకుంది.

- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,003.75 తగ్గి రూ.4,69,422.38 కోట్లకు తగ్గింది.

- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ.14,087.05 కోట్లు క్షీణించి రూ.3,81,723.36 కోట్లకు చేరింది.

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీలు

టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.

English summary

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.53 లక్షల కోట్లు పతనం | Mcap of top-10 most valued companies erodes by over ₹2.53 lakh

The top-10 most valued companies suffered a combined erosion of ₹2.53 lakh crore in market valuation last week, as the domestic equity benchmarks witnessed heavy selling in line with the global market rout.
Story first published: Sunday, January 23, 2022, 18:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X