ముంబై: దేశంలోని పది అత్యంత విలువైన కంపెనీల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పెరిగింది. ఈ సంస్థల ఆదాయం రూ.2,30,219.82 కోట్ల మేర పెరిగింది. HDFC బ్యాంకు, HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్ని కంపెనీల కంటే ఎక్కువగా పెరిగింది. గత వారం సెన్సెక్స్ 2,278.99 పాయింట్లు లేదా 5.75 శాతం ఎగిసింది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ మినహా మిగతా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది.

బ్యాంకింగ్ అదుర్స్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.68,430.18 కోట్లు పెరిగి రూ.7,19,948.29 కోట్లకు పెరిగింది. గతవారం భారీగా లాభపడిన కంపెనీల్లో HDFC బ్యాంకు ముందు ఉంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.38,484.05 కోట్లు పెరిగి రూ.3,83,771.94 కోట్లుగా నమోదయింది.
ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.34,892.98 కోట్లు పెరిగి రూ.3,05,629.04 కోట్లుగా ఉంది.
కొటక్ మహీంద్ర బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.33,649.7 కోట్లు పెరిగి రూ.3,39,980.79 కోట్లుగా నమోదయింది.
గతవారం భారీగా మార్కెట్ క్యాప్ పెరిగిన మొదటి నాలుగు బ్యాంకింగ్ రంగానికి చెందినవే.
నాలుగు సంస్థల ఎం-క్యాప్ రూ.1.70 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మార్కెట్ క్యాప్‌లో మూడొంతులు బ్యాంకింగ్ రంగానివే.

ఐటీ కంపెనీలు జూమ్
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,489.7 కోట్లు పెరిగి రూ.4,74,242.93 కోట్లుగా ఉంది.
టాటా కన్సల్టెన్సీ మార్కెట్ క్యాప్ రూ.16,285.35 కోట్లు ఎగిసి రూ.10,16,239.59 కోట్లుగా ఉంది. అంతకుముందు వారం రూ.10 లక్షలకోట్ల దిగువకు చేరుకున్న టీసీఎస్ ఎం-క్యాప్ గతవారం మళ్లీ ఈ మార్కును దాటింది.
భారతీ ఎయిర్‌టెల్ ఎం-క్యాప్ రూ.8,810.72 కోట్లు ఎగిసి రూ.2,45,363.69 కోట్లుగా నమోదయింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.5,169.03 కోట్లు పెరిగి రూ.4,92,067.57 కోట్లుగా ఉంది.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ రూ.2,008.11 కోట్లు పెరిగి రూ.2,30,824.35 కోట్లుగా నమోదయింది.

రిలయన్స్ ఒక్కటే డౌన్
గత వారం కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మాత్రమే దారుణంగా పతనమైంది. రూ.17,141.77 కోట్లు పతనమై మార్కెట్ క్యాప్ రూ.13,72,017.43 కోట్లుగా ఉంది. గతవారం ఓ సమయంలో మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. అంతకుముందు వారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో గతవారం రెండు రోజుల్లో ఈ స్టాక్ ధర భారీగా పడిపోయింది. ఓ సమయంలో రూ.1900 దిగువకు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంది.
మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీలు వరుసగా రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, HUL, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్ర బ్యాంకు, ICICI బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, HCL టెక్నాలజీస్ ఉన్నాయి.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications