గతవారం టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్లు క్షీణించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ లూజర్‌గా నిలిచింది. ఒక్క కంపెనీ మినహా అన్నీ నష్టపోయాయి. 30 షేర్ బీఎస్ఈ బెంచ్ మార్క్ గతవారం 491.90 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించింది. అంతకుముందు, టాప్ 10లోని ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,51,456.45 కోట్లు పెరిగింది. అప్పుడు అతిపెద్ద గెయినర్‌గా నిలిచిన టీసీఎస్, ఇప్పుడు టాప్ లూజర్‌గా నిలిచింది.

ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ పతనం
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.44,037.2 కోట్లు తగ్గి రూ.13,67,021.43 కోట్లకు పడిపోయింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,772.72 కోట్లు తగ్గి రూ.4,39,459.25 కోట్లకు పడిపోయింది.
- HUL మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,818.45 కోట్లు తగ్గి రూ.5,30,443.72 కోట్లకు పడిపోయింది.
- ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,574.95 కోట్లు తగ్గి రూ.5,49,434.46 కోట్లకు పడిపోయింది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,987.52 కోట్లు తగ్గి రూ.4,22,938.56 కోట్లకు పడిపోయింది.

రిలయన్స్ మాత్రమే జంప్
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,386.79 కోట్లు తగ్గి రూ.7,23,790.27 కోట్లకు పడిపోయింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,157.91 కోట్లు తగ్గి రూ.3,92,377.89 కోట్లకు పడిపోయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,993.33 కోట్లు తగ్గి రూ.8,41,929.20 కోట్లకు పడిపోయింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.803.21 కోట్లు తగ్గి రూ.4,72,379.69 కోట్లకు పడిపోయింది.
- కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ మాత్రమే పెరిగింది. అయితే ఆ పెరుగుదల స్వల్పమే. ఈ స్టాక్ వ్యాల్యూ రూ.30,474.79 కోట్లు పెరిగి రూ.16,07,857.69 కోట్లుగా నమోదయింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.16 లక్షల కోట్లు దాటింది.

టాప్ టెన్ కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ICICI బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications