టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,14,744.44 కోట్లు ఎగిసింది. ఇందులో ప్రధానంగా ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), ఇన్ఫోసిస్ కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా పెరిగింది. వీటితో పాటు హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్ సంస్థల మార్కెట్ క్యాప్ పెరిగింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీల మార్కెట్ క్యాప్ క్షీణించింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1,14,744.44 కోట్లు పెరగగా, ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్ మాత్రం రూ.99,183.31 కోట్లు తగ్గింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,816.18 కోట్లు పెరిగి రూ.12,28,898.85 కోట్లుగా నమోదయింది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.23,625.36 కోట్లు ఎగిసి రూ.6,13,854.71 కోట్లు పెరిగింది.
హిందూస్తాన్ యూనీలీవర్ మర్కెట్ క్యాప్ రూ.17,974.19 కోట్లు పెరిగి రూ.5,81,741.24 కోట్లుగా నమోదయింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.15,328.71 కోట్లు పెరిగి రూ.2,99,507.71 కోట్లకు చేరుకుంది.

వీటి మార్కెట్ క్యాప్ డౌన్
HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,750.35 కోట్లు ఎగిసి రూ.7,83,723.87 కోట్లకు క్షీణించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.24,755.52 కోట్లు తగ్గి రూ.12,56,889.45 కోట్లకు చేరుకుంది.
ICICI బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.18,996.52 కోట్లు క్షీణించి రూ.3,91,778.85 కోట్లుగా నమోదయింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ రూ.15,618.07 కోట్లు తగ్గి రూ.3,15,083.41 కోట్లకు క్షీణించింది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.3,012.59 కోట్లు క్షీణించి రూ.4,53,557.23 కోట్లుగా నమోదయింది.
కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.1,050.26 కోట్లు క్షీణించి రూ.3,56,523.48 కోట్లకు చేరుకుంది.

టాప్ 10 వరుసగా
టాప్ 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ మోస్ట్ కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత వరుసగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 438.51 పాయింట్లు లేదా 0.87 శాతం క్షీణించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications