ముంబై: టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.1.15 లక్షల కోట్లు పెరిగింది. గత కొద్ది వారాలుగా నష్టాల్లో కనిపిస్తోన్న దేశీయ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈసారి భారీగా లాభపడింది. గతవారం (గురువారం) తొలిసారి బీఎస్ఈ సెన్సెక్స్ 50,000 పాయింట్లను క్రాస్ చేసింది. అయితే దానిని నిలుపుకోలేకపోయింది. చివరకు సెన్సెక్స్ ఏకంగా 48900 దిగువకు పడిపోయింది. చివరి సెషన్లో ఏకంగా 746 పాయింట్లు నష్టపోయింది.

రిలయన్స్
గతవారం టాప్ 10లోని నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,15,758.53 కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,033.44 కోట్లు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 156.13 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టపోయింది. లాభపడిన స్టాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. రిలయన్స్ గతవారం రూ.100 వరకు పెరిగింది. చివరి సెషన్లో నష్టపోయినప్పటికీ వారం మొత్తంలో రూ.1950 దిగువ నుండి రూ.2050కి చేరువైంది.
HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ రూ.48,941.18 కోట్ల మేర నష్టపోయాయి.

ఈ స్టాక్స్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,033.44 కోట్లు పెరిగి రూ.12,99,363.47 కోట్లకు చేరుకుంది.
- ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎం-క్యాప్ రూ.26,191.64 కోట్లు ఎగిసి రూ.12,39,562.76 కోట్లకు చేరింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.13,357.22 కోట్లు ఎగిసి రూ.5,65,949.36 కోట్లుగా నమోదయింది.
- బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.5,176.23 కోట్లు లాభపడి రూ.2,99,332.25 కోట్లుగా ఉంది.

వీటి ఎం-క్యాప్ డౌన్
- భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,993.5 కోట్లు క్షీణించి రూ.3,14,703.83 కోట్లకు పడిపోయింది.
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.12,502.38 కోట్లు తగ్గి రూ.7,95,112.89 కోట్లుగా నమోదయింది.
- HDFC మార్కెట్ క్యాప్ రూ.7,677.82 కోట్లు క్షీణించి రూ.4,66,123.79 కోట్లుగా ఉంది.
- కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,416.75 కోట్లు తగ్గి రూ.3,62,665.26 కోట్లుగా ఉంది.
- ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6,370.02 కోట్లు క్షీణించి రూ.3,68,375.92 కోట్లుగా ఉంది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.1,980.71 కోట్లు పడిపోయి రూ. 5,70,976.45 కోట్లుగా ఉంది.
- మార్కెట్ క్యాప్ పరంగా వరుసగా రిలయన్స్,టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, HDFC, ICICI బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications