గతవారం టాప్ 5లోని మూడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.78 లక్షల కోట్లు పెరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. బెంచ్ మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 1532.77 పాయింట్లు లేదా 2.30 శాతం లాభపడి, 54,326 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి సెషన్లో భారీగా నష్టపోయినప్పటికీ, శుక్రవారం సెషన్లో అంతకుమించి 1534 పాయింట్లు లేదా 2.91 శాతం లాభాల్లో ముగిసింది.
గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. టాప్ 5లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్క్యాప్ రూ.1,31,320.8 కోట్లు పెరిగి రూ.17,73,889.78 కోట్లకు, హిందూస్తాన్ యూనీవర్ మార్కెట్ క్యాప్ రూ.30,814.89 కోట్లు పెరిగి రూ.5,46,397.45 కోట్లకు, HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.16,515.02 కోట్లు పెరిగి రూ.7,33,156.15 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.43,743.96 కోట్లు తగ్గి రూ.12,05,254.93 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.20,129.66 కోట్లు క్షీణించి రూ.6,12,303.26 కోట్లకు తగ్గింది.

మంగళవారం ఎల్ఐసీ 8 శాతం డిస్కౌంట్తో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,22,602.94 కోట్లుగా నమోదయింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.4,93,251.86 కోట్లు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.4,12,763.28 కోట్లు, HDFC మార్కెట్ క్యాప్ రూ.3,99,512.68 కోట్లు, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.3,77,686.72 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications