ఐటీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఓలా డ్రైవర్‌గా మారిన టెక్కీ సక్సెస్ స్టోరీ!
మన సమాజంలో ఎంబీఏ చదివి, చేతిలో రూ. 25 లక్షల (Rs 25 LPA) భారీ ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటారు. కానీ, ఆ యువకుడు మాత్రం ఏసీ రూముల్లో కూర్చుని చేసే ఉద్యోగం కంటే రోడ్లపై క్యాబ్ నడపడమే బెటర్ అనుకున్నాడు. అందరూ తిట్టినా వినకుండా ఓలా క్యాబ్ డ్రైవర్‌గా మారి, ఇప్పుడు ఏకంగా 5 కార్లకు ఓనర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండింగ్ (Trending) అవుతున్న ఈ క్రేజీ స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

బంధువులు ఏడిపించారు.. సమాజం నవ్వింది!
శశి సచన్ అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ తన సోదరుడి లైఫ్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. "మా అన్నయ్య ఒక టైర్-2 కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. అతని చేతిలో రూ. 25 లక్షల ప్యాకేజీతో మంచి జాబ్ ఆఫర్ ఉన్నా.. ఆ కార్పొరేట్ లైఫ్ అతనికి అస్సలు నచ్చలేదు. దాంతో ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగానికి రిజైన్ చేసి ఓలా క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు" అని శశి రాసుకొచ్చాడు.
ఈ నిర్ణయం తెలియగానే బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఘోరంగా మాట్లాడటం మొదలుపెట్టారు. "చదువంతా బూడిదలో పోసిన పన్నీరు చేశాడు", "ఏం కావాలనుకున్నాడు.. ఏమయ్యాడు చూడు" అంటూ ఎగతాళి చేశారు.
3 ఏళ్లలో సీన్ రివర్స్.. ఇప్పుడు ఐదు కార్లకు బాస్!
అయితే ఎవరు ఎన్ని అన్నా ఆ యువకుడు అస్సలు తగ్గలేదు. క్యాబ్ డ్రైవింగ్‌ను కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక బిజినెస్‌లా చూశాడు. కష్టపడి సంపాదిస్తూ, ఒక్క కారు నుండి ఏకంగా 5 కార్లను కొనుగోలు చేశాడు. వాటన్నింటినీ ఓలా (Ola) నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేశాడు. ప్రస్తుతం 3 ఏళ్ల తర్వాత, అతను అన్ని ఖర్చులు పోనూ నెలకు దాదాపు రూ. 1.5 లక్షలు క్లియర్‌గా సంపాదిస్తున్నాడు. "కొన్నిసార్లు మనం కిందకి దిగామనుకునే దారే.. మనల్ని లైఫ్‌లో ఇంకో లెవెల్‌కి తీసుకెళ్తుంది" అంటూ శశి తన పోస్ట్‌ను ముగించాడు.
నెటిజన్ల మధ్య మొదలైన పెద్ద యుద్ధం!
ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకుంటున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ.. "నచ్చని ఉద్యోగంలో రోజుకు 8 గంటలు నరకం చూసే కంటే, నచ్చిన బిజినెస్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించడం చాలా గ్రేట్" అని సపోర్ట్ చేస్తున్నారు.
కానీ, మరికొందరు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. "ఒకవేళ అతను అదే కార్పొరేట్ ఉద్యోగంలో ఉండి ఉంటే.. ఈ 3 ఏళ్లలో అతని జీతం రూ. 35 లక్షలు దాటేది. కార్పొరేట్ జాబ్‌లో వచ్చే హోదా, ప్రమోషన్లు, వీకెండ్ హాలిడేస్.. ఈ క్యాబ్ బిజినెస్‌లో రావు కదా" అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, ఈ రోజుల్లో యువత సాంప్రదాయ ఉద్యోగాల కంటే సొంతంగా బిజినెస్ చేయడానికి ఎంతలా ఇష్టపడుతున్నారో చెప్పడానికి ఈ ట్రెండింగ్ (Trending) స్టోరీ ఒక నిదర్శనంగా నిలిచింది!


Click it and Unblock the Notifications