Farmer Success: ఈ రోజుల్లో అందరూ బాగా చదువుకుని ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఆలోచనలో చాలా మంది వెన్నుముక లాంటి వ్యవసాయానికి దూరం అవుతున్నారు. కానీ మరో పక్క పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు మాత్రం.. వ్యసాయం వైపు మళ్లుతున్నారు. అలా ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న యువకుడు వ్యవసాయంలోకి వచ్చి కోట్లు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫలప్రదంగా వ్యవసాయం..
ప్రస్తుతం ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలను చేస్తున్న అనేక మంది వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. నష్టాలు ఆత్మహత్యల మధ్య నూతన సాంకేతికత వినియోగిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా ఉత్తరాఖండ్ కు చెందిన రాజీవ్ అనే యువకుడు బీఎస్సీ అగ్రికల్చర్ చదివి, ఆపై ఎంబీఏ చేసి ఉద్యోగం కూడా చేశాడు. కానీ ఇప్పుడు థాయ్ జామ సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.

మెుదట్లో ఆసక్తి లేనప్పటికీ..
అగ్రికల్చర్ BSc చేసిన యువకుడికి మెుదట్లో వ్యవసాయంపై మక్కువ లేదు. అయితే విత్తనాలు, మెుక్కలు అమ్ముతున్న సమయంలో దీనిపై ఆసక్తి పెరిగిందని తెలిపాడు. అలా ఈ రంగంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నట్లు. ఈ క్రమంలో థాయ్ జామ సాగు గురించి పూర్తిగా తెలుసుకుని.. 2017లో హర్యానాలోని పంచకులలో లీజుకు తీసుకున్న ఐదు ఎకరాల పొలంలో సాగు ప్రారంభించాడు. అలా అతడు జాబ్ మానేసి ఫుల్ టైమ్ రైతుగా మారిపోయాడు.

ఆదాయాల పండుగ..
అలా కేవలం 5 ఎకరాల్లో సాగు ప్రారంభించిన 30 ఏళ్ల యువకు రాజీవ్ ప్రస్తుతం దానిని 25 ఎకరాలకు విస్తరించాడు. ఇందులో దాదాపు 12 వేల చెట్లను సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎకరాకు సుమారు రూ.6 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అలా అతని ప్రస్తుత ఆదాయం మొత్తం రూ.కోటి కావడం గమనార్హం. వ్యవసాయం అనేది దండుగ కాదని ఒక పండుగని ఈ యువరైతు మరోసారి నిరూపించాడు.

మొక్కలకు విశ్రాంతి..
సహజంగా ఏడాదికి రెండు సార్లు జామ తోట కోతకు వస్తుంది. ఒకటి వర్షాకాలంలో కాగా మరోసారి చలికాలంలో. అయితే ఈ యువరైతు కేవలం వర్షా కాలంలో మాత్రమే జామ కోత నిర్వహిస్తాడు. మార్కెట్లో ఇతర పోటీదారుల నుంచి ప్రయోజనం పొందేందుకు, మంచి ధర పలికేందుకు అతడు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నాడు. దీని కారణంగా మెుక్కలకు విశ్రాంతి లభిస్తుందని రాజీవ్ చెబుతున్నాడు.

పండ్ల మార్కెటింగ్..
ఢిల్లీలోని ఏబీఎంసీ మార్కెట్‌లో రాజీవ్ తన ఉత్పత్తులను అమ్ముతున్నాడు. అక్కడ 10 కేజీల బాక్సుల్లో జామపండ్లను విక్రయిస్తున్నాడు. సీజన్, నాణ్యతను బట్టి కిలోకు రూ.40 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోందని అతడు చెబుతున్నాడు. అలా ఎకరాకు సగటున రూ.6 లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు. అలా ఏడాదికి తోటపై కోటి రూపాయల వరకు ఆర్జిస్తున్నాడు.


Click it and Unblock the Notifications