స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FPI) పెట్టుబడుల ఉపసంహరణ మే నెలలో కొనసాగింది. నికరంగా రూ.45,276 కోట్ల నిధులను ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్నారు. మార్చి 2020 తర్వాత ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు వెల్లువెత్తడం ఇది తొలిసారి. మొత్తంగా చూస్తే ఇధి రెండో అతిపెద్ద ఔట్-ఫ్లో. కరోనా కట్టడి నిమిత్తం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పాటు మార్చి 2020లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.62,000 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. ఇప్పటి వరకు ఇదే ఒక నెల గరిష్ట అమ్మకాలుగా కొనసాగుతోంది.
మళ్లీ గత నెలలో అమ్మకాలు రికార్డ్ స్థాయిలో వెల్లువెత్తాయి. వరుసగా ఎనిమిది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకందారులుగా నిలిచారు. దీంతో దేశీయ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు మూడు శాతానికి పైగా పడిపోయాయి. మే 2012 తర్వాత ఇది దారుణ ప్రదర్శన.

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్భణం పెరుగుదల ఫలితంగా ఆర్థిక మందగమన భయాలు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో లాక్ డౌన్ కారణంగా సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్యలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఆర్థిక సేవలు, ఐటీ కంపెనీలపై విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం ఎక్కువగా ఉంది. మే 15వ తేదీ నాటికి ఈ రెండు రంగాల్లో ఎఫ్‌పీఐలు రూ.18500 కోట్ల అమ్మకాలు జరిపారు.
More From GoodReturns

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

Stock Market: సెన్సెక్స్ టాప్ లూజర్స్ ఇవే.. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలా, లేక ఇన్వెస్ట్ చేయాలా?

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..



Click it and Unblock the Notifications