స్పెక్ట్రం బకాయిల కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టెల్కోలు బకాయిలు చెల్లించేందుకు విముఖత చూపిస్తే తాము స్పెక్ట్రం లైసెన్స్‌లు రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఏజీఆర్ చార్జీల బకాయిల చెల్లింపు గడువుపై అత్యున్నత న్యాయస్థానంలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ప్రధానంగా ఈ తీర్పు వొడాఫోన్ ఐడియా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా స్పెక్ట్రం ఆయా కంపెనీలకు ఉండటం వాటి రుణ పరిష్కార ప్రణాళికను ప్రభావితం చేస్తుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, వీడియో కాన్, ఎయిర్ సెల్ కంపెనీల బకాయిలు చెల్లించవలసి వస్తే అవి జియో, ఎయిర్‌టెల్ పైన భారం పడనుంది. జియోకు స్పెక్ట్రం షేరింగ్, బిజినెస్‌కు సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్‍తో సంబంధాలున్నాయి.

అలా అయితే జియో, ఎయిర్‌టెల్‌కు నష్టం
ఏజీఆర్ లెక్కలు ఇంకా ముగియలేదని సుప్రీం కోర్టుకు టెలికం శాఖ సోమవారం తెలిపింది. ట్రేడింగ్, షేరింగ్ స్పెక్ట్రంపై మొత్తం ఏజీఆర్ బకాయిల లెక్కింపు కోసం సుప్రీం కోర్టు తుది ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు టెలికం శాఖ తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి దివాలా తీసిన సంస్థల స్పెక్ట్రంను వినియోగించుకున్న సంస్థలు పాత బకాయిలు చెల్లించాలని సుప్రీం ఆదేశిస్తే జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలకు భారీ నష్టం వాటిల్లనుంది. ఎయిర్‌టెల్‌కు ఇప్పటికే ఏజీఆర్ బకాయిల భారం ఎక్కువగా ఉంది.

ఈ వారంలో తీర్పు వెలువడే అవకాశం
స్పెక్ట్రం ట్రేడింగ్‌కు సంబంధించి ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. దివాళా తీసిన సంస్థల్లో ఆర్.కామ్., వీడియోకాన్, ఎయిర్‌సెల్ వంటివి ఉన్నాయి. వీటి స్పెక్ట్రంను రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఉపయోగించుకున్నాయి. ఇవి వాడుకున్ందున ఏజీఆర్ బకాయిలు వసూలు చేయాలా లేదా అనే అంశాన్ని సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ అరుణ్ మిశ్రా సెప్టెంబర్ 2న రిటైర్ అవుతున్నారు. దీంతో ఈ వారంలో తీర్పు వెలువడే అవకాశముంది.

సర్వీస్ ట్యాక్స్ రద్దు చేయాలని..
మరోవైపు, ఏజీఆర్ బకాయిలపై సర్వీస్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను టెల్కోలు కోరాయి. ఇప్పటికే టెల్కోలు నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. టారిఫ్స్ చాలా తక్కువగా ఉన్నాయని టెల్కోలు భావిస్తున్నాయి. సోమవారం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ టారిఫ్ పెంపు సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రస్తుత డేటా ఛార్జీలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. టెలికం పరిశ్రమ బతికి ఉడాలంటే డేటాపై ప్రస్తుతం ఉన్న ధరలు ఏమాత్రం సరిపోవన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications