ట్యాక్స్ అలర్ట్: మే నెలలో ఈ తేదీలు మర్చిపోతే పెనాల్టీలే! మీ క్యాలెండర్‌లో ఇప్పుడే మార్క్ చేసుకోండి!
డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో, పన్ను నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యం. 2026 మే నెలలో పన్ను చెల్లింపుదారులు, వ్యాపార సంస్థలు , సంస్థలకు చాలా బిజీ షెడ్యూల్ ఉండబోతోంది. TDS (Tax Deducted at Source), TCS (Tax Collected at Source) డిపాజిట్ చేయడం నుంచి సర్టిఫికెట్లు జారీ చేయడం వరకు పలు కీలక గడువులు ఈ నెలలో ఉన్నాయి. పొరపాటున ఆఖరి తేదీ (last date) మర్చిపోతే భారీ జరిమానాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఆ ముఖ్యమైన తేదీలు ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.

మే 15, 2026: అత్యంత కీలకమైన రోజు
మే 15 నాటికి పలు ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది..
- TDS సర్టిఫికెట్ల జారీ: మార్చి 2026లో ఆస్తి కొనుగోలు (Section 194-IA), అద్దె చెల్లింపులు (Section 194-IB) , ఇతర చెల్లింపులపై కట్ చేసిన TDSకి సంబంధించిన సర్టిఫికెట్లను ఈ తేదీలోపు జారీ చేయాలి.
- TCS క్వార్టర్లీ స్టేట్‌మెంట్: మార్చి 31, 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి డిపాజిట్ చేసిన TCS స్టేట్‌మెంట్‌ను సమర్పించడానికి ఇదే ఆఖరి తేదీ (last date).
- ప్రభుత్వ కార్యాలయాలకు: ఏప్రిల్ నెలలో చలాన్ లేకుండా TDS/TCS ప్రాసెస్ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు 'ఫారమ్ 24G'ని మే 15 లోపు సబ్మిట్ చేయాలి.
- స్టాక్ ఎక్స్ఛేంజీలు: ఏప్రిల్ నెలలో జరిగిన క్లయింట్ కోడ్ మార్పుల నివేదికను కూడా ఈ తేదీలోపే అందించాలి.
మే 30, 2026: నెల చివరి గడువులు
మే నెల ముగిసేలోపు మరికొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి..
- TCS సర్టిఫికెట్లు: 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4) సంబంధించి TCS సర్టిఫికెట్లను జారీ చేయడానికి మే 30 ఆఖరి తేదీ.
- సెక్షన్ 285B సమాచారం: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం అవసరమైన సమాచారాన్ని ఈ తేదీలోపు అందించాలి.
- చలాన్-కమ్-స్టేట్‌మెంట్: 2025 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ట్యాక్స్ డిడక్షన్‌కు సంబంధించిన చలాన్-కమ్-స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి కూడా ఇదే చివరి అవకాశం.
గడువు మించితే ఏమవుతుంది?
చాలామంది ట్యాక్స్ పనులు కదా అని చివరి నిమిషం వరకు వాయిదా వేస్తుంటారు. కానీ ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. గడువు దాటిన ప్రతి రోజుకు జరిమానా పడటమే కాకుండా, చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఐటి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్లాన్ ప్రకారం ముందే ఈ పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా జీతం తీసుకునే వారు, పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లించే వారు , వ్యాపార సంస్థలు ఈ క్యాలెండర్‌ను ఫాలో అవ్వడం వల్ల అనవసరమైన టెన్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. గుర్తుంచుకోండి, మే 15 , మే 30 ఈ నెలలో మీకు చాలా ముఖ్యమైన రోజులు!


Click it and Unblock the Notifications