Max Healthcare: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సహారా హాస్పిటల్ చేతులు మారుతోంది. ప్రస్తుతం ఈ డీల్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
హెల్త్ కేర్ రంగంలోని దిగ్గజ కంపెనీ అయిన మ్యాక్స్ హెల్త్‌కేర్ లిమిటెడ్ సహారా హాస్పిటల్‌ను రూ.940 కోట్లకు కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ విషయాన్ని మ్యాక్స్ డిసెంబర్ 8న స్టాక్ ఎక్స్ఛేంజీకి వెళ్లడించటంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం సహారా హాస్పిటల్.. స్టార్లిట్ మెడికల్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కింద నడుస్తోంది

సహారాలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి న్యూరో విభాగంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సహారా హాస్పిటల్ మొత్తం 550 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. లక్నో గోమతి నగర్‌లో 17 అంతస్తుల సహారా హాస్పిటల్ ఉంది. ఆసుపత్రి మొత్తం 8.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. అదే క్యాంపస్‌లో నర్సింగ్ కళాశాలను సైతం హాస్పిటల్ కలిగి ఉంది.
సహారా హాస్పిటల్ కొనుగోలు గురించి చాలా సంతోషిస్తున్నట్లు మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ చైర్మన్, MD అభయ్ సోయి అన్నారు. తాము కొత్తగా టైర్-1, టైర్-2 నగరాల్లో ప్రవేశించే వ్యూహంలో భాగంగా జరుగుతున్నట్లు తెలిపారు. లక్నోలో కొనుగోలు ద్వారా.. ఉత్తరప్రదేశ్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందిస్తామని అన్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో మాక్స్ హెల్త్‌కేర్ షేర్ ధర రూ.678.20 వద్ద ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications