Matsya Kanya: జలకన్యకు రూ.6 లక్షల జీతం.. ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయా..! ఎక్కడంటే..
Crazy Job: మత్స్యకన్యలు, జలకన్యలు, సాగరకన్యలు.. ఇలాంటి పాత్రలను అలనాటి తెలుగు సినిమాల్లో మనం చూశాము. ఈ స్టోరీ తెలుసుకుంటే మీకు తప్పకుండా సాహసవీరుడు సాగరకన్య సినిమా గుర్తుకురాక మారదు. ఇలాంటివి కేవలం ఊహలవరకే పరిమితం అనుకుంటాం.

భారత పురాణాల్లో..
అయితే భారత పురాణాల్లో సైతం వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. పైగా విదేశీ సినిమాల్లో ఈ పాత్రలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆక్వామ్యాన్ సినిమా వచ్చి విజయం సాధించింది. మత్స్యకన్య అంటే తల నుంచి నడుము వరకు మానవ శరీరం, నడుము క్రింద చేప ఆకారంలో ఉండే స్త్రీ అని మనకు తెలుసు. ఇలాంటి ఉద్యోగం గురించి మీరెప్పుడైనా విన్నారా..? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విదేశాల్లో ఉద్యోగంగా..
విదేశాల్లోని వాటర్ థీమ్ పార్కుల్లో జలకన్యలా వేషం వేసి అలరించడం సర్వసాధారణం. వీరిని చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే మత్స్యకన్యలకు విపరీతమైన జీతాలు చెల్లిస్తారు.

డిస్నీ పాత్ర..
32 ఏళ్ల మహిళ డిస్నీ క్యారెక్టర్ ఏరియల్ లాగా దుస్తులు ధరించి, మేకప్ వేసుకుని నెలకు 8,000 డాలర్లను ఆర్జిస్తోంది. మన భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.6 లక్షల కంటే ఎక్కువ.

వాల్ట్ డిస్నీ పిక్చర్స్..
ఏరియల్ అనేది 1989లో విడుదలైన వాల్ట్ డిస్నీ పిక్చర్స్ 28వ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ది లిటిల్ మెర్మైడ్‌లో ఒక కల్పిత పాత్ర. ఈ కథను హన్స్ క్రిస్టియన్ అండర్సన్ 1837లో "ది లిటిల్ మెర్మైడ్" పేరుతో కథగా ప్రచురించారు. 1989లో కథను కొన్ని మార్పులతో యానిమేషన్ చిత్రంగా రూపొందించారు.

సాగరంలో..
ప్రస్తుతం సముద్రం ఆధారంగా వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నుండి ప్రతి చిత్రం మత్స్యకన్యకు సంబంధించిన సన్నివేశాలు ఉండేలా చూస్తోంది. 1989లో యానిమేషన్ చిత్రం తర్వాత మత్స్యకన్య పాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ కొనసాగుతోంది.
ప్రైవేట్ ఈవెట్స్, సోషల్ మీడియాలో..
ప్రస్తుతం గుగ్లీల్మో అనే 32 ఏళ్ల మహిళ ప్రస్తుతం ఫైవ్ స్టార్ ఈవెంట్‌లు, పిల్లల పార్టీల్లో మత్స్యకన్యగా ప్రదర్శనలు ఇస్తోంది. ఇది మాత్రమే కాక గుగ్లీల్మో.. మత్స్యకన్యగా టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.

10 సంతవ్సరాలుగా..
22 ఏళ్ల వయస్సు నుంచి గుగ్లీల్మో అనేక పార్టీలు, షోలు, వివిధ వాటర్ థీమ్ పార్కులలో మత్స్యకన్యగా పనిచేస్తోంది. ఈ 10 సంవత్సరాల్లో ఆమె నెలవారీ జీతం 8,000 డాలర్లకు చేరుకుంది. ఆమె పూర్తి పేరు ఎమిలీ అలెగ్జాండ్రా గుగ్లియెల్మో.


Click it and Unblock the Notifications