భారత్‌కు చెందిన పలు యాప్‌లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజు చెల్లింపులపై తలెత్తిన వివాదం క్రమంలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లోని తన ప్లే స్టోర్ నుంచి పలు యాప్స్ తొలగిస్తోంది. అందులో 'భారత్ మ్యాట్రిమోనీ' వంటి పాపులర్ యాప్ సహా మొత్తం పది కంపెనీల యాప్‌లను గూగుల్ తొలగించనుంది.
సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం నేపథ్యంలో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ జాబితాలో షాదీ, మ్యాట్రిమోనీ, భారత్ మ్యాట్రిమోనీ సహా జాబ్ యాప్ నౌకరీ, బాలాజీ టెలీఫిల్మ్స్‌కు చెందిన ఆల్ట్, ఆడియో ప్లాట్‌ఫాం అయిన కుకు FM, డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ వంటివి ఈ తొలగింపుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, 11 - 26 శాతం ఫీజులు చెల్లించలేమంటూ మ్యాట్రీమోనీ యాప్‌ల నిర్వహకులు ఇంతకుముందే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే వివాదానికి కారణమయ్యింది. విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు.. 15-30 శాతం ఫీజులు విధించే పాత విధానాన్ని రద్దు చేయాలంటూ కొద్దికాలం క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో గూగుల్ యాప్‌లను తొలగించే పనిలో పడింది.
మ్యాట్రిమోనీ వంటి స్టార్టప్‌లకు ఉపశమనం అవసరం లేదంటూ జనవరి, ఫిబ్రవరిలో కోర్టులు పేర్కొనడం జరిగింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం కోర్టు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో ఫీజు వసూలు చేయడం లేదా యాప్‌లను తొలగించే పని చేయవచ్చని పేర్కొన్నాయి. దీంతో గూగుల్ భారత్‌లోని పలు మ్యాట్రిమోనీ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యింది. అందులో భారత్ మ్యాట్రిమోనీ, క్రీస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రీమోనీ, జోడీ యాప్‌లను గూగుల్ శుక్రవారం తొలగించేసింది.
స్పందించిన ప్రముఖులు..
క్వాక్‌క్వాక్ ఫౌండర్ రవి మిట్టల్ మాత్రం గూగుల్ తీసుకున్న చర్యపై స్పందించారు. వెంటనే నిబంధనల్ని పాటించి తిరిగి ప్లే స్టోర్‌లోకి వస్తామని ఆయన తెలిపారు. ఇక, కుకు ఎఫ్ఎం కోఫౌండర్ వినోద్ కుమార్ మీనా మాత్రం గూగుల్‌పై విరుచుకుపడ్డారు. ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ మాత్రం భారత కంపెనీలకు యూపీఐ, ONDC తరహాలోనే యాప్ స్టోర్ అనేది ఉండాలని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications