మాస్టర్ కార్డ్ కీలక నిర్ణయం, మ్యాగ్నటిక్ స్ట్రిప్స్ తొలగింత... ఇక చిప్స్!
కార్డ్స్ దిగ్గజం మాస్టర్ కార్డ్స్ రాబోయే పది సంవత్సరాల్లో తన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పైన మ్యాగ్నటిక్ స్ట్రైప్స్‌ను తొలగిస్తుంది. పాత తరహా స్వైప్‌కు మరింత సమర్థవంతమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా మార్పును తీసుకువస్తుంది. మ్యాగ్నటిక్ చారలను తొలగిస్తున్న మొట్టమొదటి పేమెంట్ నెట్ వర్క్ ఇదే అవుతుంది. మాస్టర్ కార్డ్స్ 1960లలో ప్రారంభమైంది. అలాగే, కార్డు మెటాలిక్ గీతల పైన సమాచారాన్ని నిల్వ చేయడానికి బ్యాంకులకు అనుమతించింది. కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, మైక్రోచిప్స్, బయోమెట్రిక్ గుర్తింపుతో సహా విస్తృత వినియోగంలో కొత్త కార్డ్ టెక్నాలజీలో మాగ్ స్ట్రిప్ దాని గడువు తేదీని చేరుకుంటోందని గతవారం బ్లాగ్‌లో మాస్టర్ కార్డ్ పేర్కొంది.
కార్డ్ స్వైప్స్ దూరంగా లేవని, కొత్తగా జారీ చేసిన మాస్టర్ కార్డ్స్ ఇప్పటికీ మ్యాగ్నటిక్ చారలను కలిగి ఉంటుందని పేర్కొంది. కానీ 2024లో ఇవి ఐచ్ఛికంగా మారుతాయని పేర్కొంది. మాస్టర్ కార్డ్ 2029 నాటికి మ్యాగ్నటిక్ స్ట్రిప్స్ లేకుండా కార్డులను జారీ చేస్తుందని తెలిపింది. 2033 నాటికి ఇవి పూర్తిగా తొలగించబడతాయని వెల్లడించింది.

చిప్స్‌తో కూడిన కార్డులు కొత్త ప్రమాణంగా మారుతాయని తెలిపింది. మ్యాగ్నటిక్ స్ట్రిప్‌తో పోలిస్తే చిప్స్ మరింత సురక్షితమని, ఎందుకంటే ఇది బ్యాంకు ద్వారా ధృవీకరించబడిన ప్రత్యేక ట్రాన్సాక్షన్ కోడ్‌ను సృష్టిస్తుందని తెలిపింది. ఈ కొత్త టెక్నాలజీ (చిప్) ద్వారా డూప్లికేట్ చేయడం మ్యాగ్నిటిస్ స్ట్రిప్ కంటే కష్టతరమని తెలిపింది. రిటైలర్స్ పేమెంట్ సిస్టంను హ్యాకింగ్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డు పూర్తి సమాచారాన్ని హ్యాక్ చేయడాన్ని కూడా నిరోధిస్తుందని తెలిపింది. చిప్ ఆధారిత క్రెడిట్ కార్డులు 1960లలో ప్రారంభమయ్యాయని, కానీ ఇది పూర్తిగా డెవలప్ కావడానికి దశాబ్దాలు పట్టిందన్నారు.


Click it and Unblock the Notifications