For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాకు మాస్టర్ కార్డ్ షాక్, పలు ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ బ్లాక్!

|

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్టర్‌కార్డ్ మాస్కోకు షాకిచ్చింది. రష్యాపై ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. స్విఫ్ట్ నుండి కూడా రష్యాను తొలగించాయి. ఇదే క్రమంలో చెల్లింపు నెట్ వర్క్ నుండి బహుళ ఆర్థిక సంస్థలను బ్లాక్ చేసినట్లు మాస్టర్ కార్డ్ సోమవారం తెలిపింది. మాస్టర్ కార్డ్ మున్ముందు రెగ్యులేటర్‌తో కలిసి పని చేయడం కొనసాగిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, మానవతా సహాయం కోసం 2 మిలియన్ డాలర్లను అందిస్తామని తెలిపింది.

అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని, వాటిని అమలు చేసేలా ఏవైనా అదనపు ఆంక్షలకు కూడా కట్టుబడి ఉందని వీసా ఇంక్ వేరుగా పేర్కొంది. అంతకుముందు శనివారం రోజు స్విఫ్ట్ అంతర్జాతీయ చెల్లింపుల నుండి రష్యాలోని కీలక బ్యాంకులను నిషేధిస్తున్నట్లు అమెరికా, మిత్ర దేశాలు ప్రకటించాయి. మరోవైపు, రష్యా మాత్రం ఉక్రెయిన్‌పైన యుద్ధాన్ని తమ ప్రత్యేక ఆపరేషన్ అని చెబుతోంది.

Mastercard blocks multiple financial institutions over sanctions on Russia

బ్యాంకు కార్డులు పని చేయడం నిలిచిపోవచ్చునని లేదా అమెరికా సహా వివిధ దేశాల ఆంక్షల నేపథ్యంలో బ్యాంకులు నగదు ఉపసంహరణను పరిమితం చేయవచ్చుననే ఆందోళనల మధ్య రష్యన్‌లు ఆదివారం ఏటీఎంల వద్దకు పరుగెత్తారు. పెద్ద పెద్ద క్యూలు కట్టారు.

English summary

రష్యాకు మాస్టర్ కార్డ్ షాక్, పలు ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ బ్లాక్! | Mastercard blocks multiple financial institutions over sanctions on Russia

Mastercard Inc said late on Monday it had blocked multiple financial institutions from its payment network as a result of sanctions imposed on Russia over Moscow's invasion of Ukraine.
Story first published: Tuesday, March 1, 2022, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X