అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం Verizon తన చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాబోయే వారం ప్రారంభంలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్‌కు సమాచారం అందింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతం ఉండగా, వెరిజోన్ ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా ఇది నిలవనుంది.
అక్టోబర్ ప్రారంభంలోనే బాధ్యతలు స్వీకరించిన కొత్త CEO డాన్ షుల్మన్, తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో వెరిజోన్‌ను తిరిగి లాభదాయక మార్గంలో నడిపేందుకు పునర్వ్యవస్థీకరణ చర్యలను చేపడుతున్నారు. టెలికాం మార్కెట్లో వృద్ధి శాతం తగ్గిపోయిన సమయంలో.. కంపెనీ ఖర్చు తగ్గించుకుని వేగంగా దూసుకుపోగల సంస్థగా మారాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.
రాబోయే ఉద్యోగ కోతలు ముఖ్యంగా యూనియన్ కాని మేనేజ్మెంట్, కార్పొరేట్ రోల్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక, వెరిజోన్ సంస్థకు చెందిన 180 రిటైల్ దుకాణాలను ఫ్రాంచైజీలకు అప్పజెప్పి నేరుగా నిర్వహించే దుకాణాల సంఖ్యను తగ్గించాలనే వ్యూహాన్ని కూడా అమలు చేయనుంది. ఈ చర్యతో ఆపరేషనల్ ఖర్చులు భారీగా తగ్గుతాయని కంపెనీ అంచనా.

వెరిజోన్ ఇంత పెద్ద నిర్ణయం వెనుక కారణాలు చూసినట్లయితే.. అమెరికా టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. AT&T, T-Mobile వంటి ప్రత్యర్థులు కొత్త ఐఫోన్ మోడళ్ల లాంచ్ సమయంలో చౌకైన డేటా ప్లాన్‌లు, ఉచిత అప్‌గ్రేడ్‌లు, భారీ డిస్కౌంట్‌లు ఇవ్వడం వల్ల కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. Comcast, Charter వంటి కేబుల్ కంపెనీలు మొబైల్ + బ్రాడ్‌బ్యాండ్ బండిల్స్‌తో మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వెరిజోన్ తన సేవల ధరలను దూకుడుగా తగ్గించకుండా వాటితో పోటీ పడటం కష్టమవుతోంది.
మూడో త్రైమాసికంలో వెరిజోన్ కేవలం 44 వేల కొత్త నెలవారీ వైర్‌లెస్ కస్టమర్లను మాత్రమే యాడ్ చేసుకుంది. అదే సమయంలో T-Mobile 10 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను జోడించగా..AT&T కూడా స్థిరంగా ముందంజలో ఉంది. కస్టమర్లను నిలబెట్టుకునేందుకు వెరిజోన్ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ వ్యయం తగ్గించేందుకు ఉద్యోగ కోతలను ఉపయోగించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలలో వెరిజోన్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 2021లో 5G నెట్‌వర్క్‌కు కీలకమైన మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం 52 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. Frontier Communications ను 20 బిలియన్ డాలర్లకు, TracFone Wireless ను 6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ఫలితాలు రావడానికి సమయం పడుతుండటంతో కంపెనీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
గత మూడు సంవత్సరాలలో వెరిజోన్ ఇప్పటికే 20 వేల ఉద్యోగాలను తగ్గించింది. 2023లో మాత్రమే 4,800 మంది ఉద్యోగులు స్వచ్ఛంద రిటైర్మెంట్ పథకం కింద వెళ్లిపోయారు. ఇది కంపెనీకి దాదాపు 2 బిలియన్ల ఖర్చును తీసుకొచ్చింది. కంపెనీని మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చి, తిరిగి కస్టమర్లను ఆకర్షించే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఈఓ భావిస్తున్నారు. అయితే, ఈ భారీ ఉద్యోగ కోతలు వెరిజోన్ మార్కెట్ పనితీరును ఎంతవరకు మెరుగుపరుస్తాయో చూడాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications