హైదరాబాద్‌‌లో నేడు కూడా ఇంటర్నెట్, టీవీ సేవలు బంద్.. కొనసాగుతున్న కేబుల్ వైర్ల తొలగింపులు

హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్న స్టార్‌ కేబుళ్లు, టీవీ, ఇంటర్నెట్‌ ఫైబర్‌ కేబుళ్లని తొలగించే చర్యలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన వరుస ప్రమాద ఘటనలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSSPDCL) ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, విద్యుత్‌ స్తంభాలకు వేలాడుతూ ప్రమాదంగా మారిన కేబుళ్లను తొలగిస్తున్నారు.

అయితే దీనిపై నిరసనలు వెలువెత్తుతున్నాయి.ఈ fiber cables తొలగింపు చర్యలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా చేపట్టినందున ప్రజలు తీవ్ర ఇంటర్నెట్, టీవీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాల కోసం పరుగులు తీశారు. ముఖ్యంగా ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు, ఆన్‌లైన్‌ క్లాసులు వినియోగించే విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం నగరంలో టీవీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్న ప్రైవేట్‌ సంస్థలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వీటిలో చాలా సంస్థలు విద్యుత్‌ శాఖ నియమావళిని పాటించకుండానే ఫైబర్‌ కేబుళ్లను తక్కువ ఎత్తులో వేలాడదీస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒకవేళ విద్యుత్‌ స్తంభాలపై కేబులు కనెక్ట్‌ చేయాలంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే ప్రతి స్తంభానికి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు చెల్లించాలి. అలాగే కనీసం 15 ఫీట్ల ఎత్తులోనే కేబుళ్లు వేయాలని విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది.అయితే చాలా సంస్థలు ఈ నియమాలను విస్మరిస్తూ కేవలం 10 అడుగుల లోపలే కేబుల్ వైర్లను స్థంభాలకు అమర్చుతున్నారు.

Hyderabad broadband outage power utility cable cut COAI statement internet disruption Hyderabad fiber cables removal broadband users affected Hyderabad internet blackout telecom operators protest COAI p ver

ప్రతి స్తంభానికి మధ్య గరిష్టంగా 50 మీటర్ల వరకు మాత్రమే తీగలు సాగాలి. ఒక మీటర్‌కు 200 గ్రాములను మించకుండా బరువు ఉండాలి. కేబుల్ ఆపరేటర్లు ఈ నిబంధనలను పాటించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఒకే స్తంభానికి అధి బరువుతో కూడిన అనేక కేబుళ్లను చుట్టి వేస్తున్నారు. దీంతో పాటుగా అనుమతులు తీసుకోకుండానే జంక్షన్‌ బాక్సులను ఏర్పాటు చేసి విద్యుత్‌ను వినియోగిస్తున్న సంఘటనలు చాలనే ఉన్నాయి. ఈ సంస్థలు నెలవారీ బిల్లులు చెల్లించకుండానే యథేచ్ఛగా విద్యుత్‌ను వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. నగరంలో ఈ తరహా సంస్థలు అరవైకు పైగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో TSSPDCL CMD ముషారఫ్‌ ఫరూఖీ.. అన్ని కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. నిబంధనలు కచ్చితంగా పాటించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కొంతమంది స్థానిక నేతలు, అధికారుల ఒత్తిడి వల్ల తొలగింపు చర్యలు ఆగిపోయాయి. అయితే ఇటీవల రామంతాపూర్‌, అంబర్‌పేట‌, బండ్లగూడ ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. సోమవారం ప్రారంభమైన కేబుల్స్‌ తొలగింపు ప్రక్రియ మంగళవారం కూడా మరింత వేగంగా కొనసాగింది.

అంతేకాదు, శిల్పాల తరలింపులో ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన సూచనలు కూడా జారీ చేశారు. గణేష్‌ విగ్రహాల తరలింపు సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని TSSPDCL అధికారులు కోరారు. విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా రూట్‌ ఎంపిక చేసుకోవాలన్నారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు ఎదురైతే విద్యుత్‌ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు.

విగ్రహాల, క్రేన్లు, ట్రక్కులు వంటి భారీ వస్తువుల రవాణా సమయంలో విద్యుత్‌ లైన్ల నుంచి కనీసం రెండు అడుగుల దూరం ఉండేలా చూడాలని అధికారులు సూచించారు. అలాగే డెకరేషన్‌ కోసం ఉపయోగించే మెటల్‌ ఫ్రేములను కూడా తగ్గించాలన్నారు. మండపాలకు విద్యుత్‌ కనెక్షన్‌ అవసరమైతే తప్పకుండా అధికారికంగా దరఖాస్తు చేయాలని తెలిపారు. విద్యుత్‌ పని సామాన్యులు చేయకుండా, నిపుణుల ద్వారా మాత్రమే చేయాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్‌ తీగలు, స్తంభాలు వంటి ప్రమాదకర అంశాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి లీకేజీలు ఉండకూడదని, వానపడే సమయంలో తేమ వల్ల ప్రమాదాలు చోటుచేసుకోవచ్చని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌ (TGSPDCL) హైదరారబాద్ నగర వ్యాప్తంగా విచక్షణారహితంగా ఫైబర్ కేబుళ్లను కత్తిరించడం వల్ల హైదరాబాద్‌ నగరంలో ఫైబర్-టు-హోమ్ (FTTH) బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ తీవ్రంగా ప్రభావితమైందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

COAI డైరెక్టర్ జనరల్ ఎస్. పి. కొచ్చర్ మాట్లాడుతూ..ఈ రోజు నగరంలో పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు నెట్‌వర్క్ అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లను విచక్షణారహితంగా, దూకుడుగా కత్తిరించినందున ఈ అంతరాయం ఏర్పడిందని చెప్పారు.

కాగానిన్న మతపరమైన ఊరేగింపు సందర్భంగా రెండు వరుస విద్యుత్ షాక్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఏడుగురు దుర్మరణం చెందడంతో విద్యుత్‌ సంస్థ విద్యుత్ స్తంభాలకు వేలాడుతుండే తీగలపై తమ చర్యలను ముమ్మరం చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+