Gold Reserve: ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ నిక్షేపాలతో ప్రపంచాన్ని శాశిస్తూ ధనిక దేశంగా మారింది సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశానికి భారీ ఆదాయాన్ని అందించే గోల్డ్ నిక్షేపాలు ఇటీవల బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియా ఇటీవల భారీగా బంగారు వనరులను కనుగొన్నట్లు ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా ముడి చమురు నిల్వలకు అదనపు బలం చేకూరింది. సౌదీలోని మక్కా ప్రాంతంలోని అల్ ఖుర్మా గవర్నరేట్‌లో ప్రస్తుతం ఉన్న మన్సూరా మస్సరా బంగారు గనికి దక్షిణంగా 100 కిమీ విస్తీర్ణంలో నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇదే విషయాన్ని సౌదీ అరేబియా మైనింగ్ కంపెనీ(మాడెన్) ధృవీకరించింది. 2022లో స్థాపించబడిన కంపెనీ మంచి ఫలితాలను సూచిస్తోంది.

డ్రిల్ ఫలితాలు మన్సౌరా మస్సరా నిక్షేపానికి భౌగోళిక సారూప్యతలను ప్రదర్శించాయి. వివిధ సైట్‌ల నుంచి నమూనాను పరిశీలించగా.. ఒక చోట టన్నుకు 10.4 గ్రాముల బంగారం, మరొక చోట 20.6 గ్రాముల హై గ్రేడ్ గోల్డ్ నిక్షేపాలను డ్రిల్లింగ్ ప్రక్రియలో గుర్తించబడ్డాయి. తాజా అన్వేషణలు ఫలవంతం కావటంతో మాడెన్ సంస్థ 2024లో మన్సౌరా మస్సారా చుట్టూ డ్రిల్లింగ్ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని చూస్తోంది.
2023 చివరి నాటికి మన్సౌరా మజారా బంగారు గని సుమారు 7 మిలియన్ ఔన్సుల బంగారు ఖనిజాన్ని కలిగి ఉన్నట్లు నివేదించింది. ఇది సంవత్సరానికి 2,50,000 ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నివేదించింది. కంపెనీ 2022లో 11,982.84 ఔన్సుల బంగారం ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం కనుగొన్న కొత్త గోల్డ్ నిక్షేపాలు ప్రపంచంలోని తదుపరి గోల్డ్ రష్‌కు కేంద్ర బిందువుగా మారుతుందని మాడెన్ సీఈవో రాబర్ట్ విల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications