Gold Mines in India: దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల్లోనే పసిడి ధర లక్షకు పైగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఓ వైపు అయితే మరో వైపు చాలినంత గోల్డ్ లేకపోవడం కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం గనులు ప్రపంచ వ్యాప్తంగా చైనా, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచే బంగారాన్ని వెలికి తీస్తున్నారు. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా బంగారు గనులు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలో ఏడు నగరాల్లో బంగారం గనులు ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు.
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లాలో గణనీయమైన బంగారు నిల్వలు ఉన్నట్లు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాథమిక సర్వేలు ప్రకారం.. ఈ బంగారు నిల్వలు సుమారు 100 హెక్టార్లకు పైగా విస్తరించి ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మైనింగ్ ప్రాంతం లక్షల టన్నుల వరకు పసుపు లోహ ఖనిజ సంపదను కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అధికారికంగా నిర్ధారణ అయితే.. జబల్‌పూర్ జిల్లా దేశంలోని అతి ముఖ్యమైన బంగారు గనుల కేంద్రమైనట్లు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు బంగారు నిల్వల ద్వారా పేరుపొందగా..తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరుతోంది. ఇది జాతీయ ఆర్థిక భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ గనుల వృద్ధి ద్వారా కేవలం ప్రభుత్వ ఆదాయమే కాకుండా.. స్థానికంగా ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా లేకపోయినప్పటికీ.. ఇది చారిత్రాత్మకంగా విలువైన నిల్వలను కలిగి ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలోని ఏడు బంగారు గనులుపై ఓ లుక్కేద్దాం..
కర్ణాటకలోని హుట్టి బంగారు గని : రాయచూర్ జిల్లాలోని హుట్టి గని భారతదేశంలో ప్రాచీనమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది సంవత్సరానికి సుమారు 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తోంది. దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గనికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF): ఇది కూడా కర్ణాటకలో ఉంది. 1880లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించిన KGF ఒకప్పుడు ప్రపంచంలో రెండవ అత్యంత లోతైన గనిగా నిలిచింది. ఇది దాని జీవితకాలంలో సుమారు 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఇది 2001లో మూసివేయబడింది.అయితే 2025లో తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని సోన్‌భద్ర గనులు: 2020లో భూగర్భ శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించిన సోన్‌భద్ర గనులు ఉత్తరప్రదేశ్‌లో బంగారం తవ్వకానికి కొత్త అధ్యాయాన్ని తెరిచాయి. ఇవి రాబోయే కాలంలో ఉత్తరభారత బంగారు పరిశ్రమకు మార్గదర్శకమవుతాయని నిపుణుల అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి బంగారు క్షేత్రం : చిత్తూరు జిల్లాలోని ఈ ప్రదేశం విజయనగర సామ్రాజ్య కాలం నుండి బంగారు నిల్వలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఇప్పటికీ పరిశోధనకు, తవ్వకానికి కేంద్రంగా మారుతోంది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే బంగారం కరువు తీరుతుంది.
జార్ఖండ్ లోని పరాసి బంగారు గని: తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని పరాసి గని చిన్నదైనా.. రాగి, బంగారు నిల్వల కలయికకు ప్రసిద్ధి. ఇది ఆ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనుంది.
కర్ణాటక లోని గడగ్ బంగారు గని : ఇది కూడా చిన్న గనిగా ఉన్నా.. ఇది దక్షిణ భారతదేశంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది స్థానికంగా ఉపాధి కల్పనలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని చిగర్గుంట-బిసనతం గని : ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది. భవిష్యత్‌లో ఇది ఒక ప్రముఖ బంగారు కేంద్రంగా ఎదిగే అవకాశముంది. దీనిపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
ఏదేమైనా.. జబల్‌పూర్‌లో తాజా బంగారు నిల్వల అన్వేషణ భారతదేశంలో బంగారం పరిశ్రమకు మంచి భవిష్యత్తు సూచికగా మారనుంది. ఇది దేశ ఆర్థికతను బలోపేతం చేయడమే కాకుండా, స్థానిక అభివృద్ధికి పెద్ద ఆదాయంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు కూడా ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు పావులు కదుపుతున్నాయని సమాచారం.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications