For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్ లో పెట్టుబడి పెట్టిన అమెరికా సంస్థ.. డీల్ వివరాలు ఇలా

|

Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్స్ దొరికితే ఏ ఇన్వెస్టర్ అయినా వదులుకుంటారు. అందుకే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ భారత కంపెనీలో పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఈ మల్టీబ్యాగర్ రాకెట్ వేగంతో పెరుగుతోంది. తన పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించింది.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బిల్డింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ స్మాల్ క్యాప్ కంపెనీ గురించే. ప్రస్తుతం ఈ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.822.05 వద్ద ఉంది. గతంలోనూ తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించిన హిస్టరీ ఈ కంపెనీ స్టాక్ సొంతం. అయితే ప్రస్తుతం ఈ స్టాక్ మరోసారి వార్తల్లో నిలవటానికి చాలా పెద్ద కారణమే ఉంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ ఇందులో పెట్టుబడులను పెట్టింది.

పెట్టుబడి వివరాలు..

పెట్టుబడి వివరాలు..

కేంబ్రిడ్జ్‌కు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 23 జూన్ 2022 నుంచి 11 అక్టోబర్ 2022 మధ్య కాలంలో అదనపు షేర్లను కొనుగోలు చేసింది. జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్‌లో ఇప్పటికే 5.04 శాతం వాటాను కలిగి ఉంది. BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న MIT ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్ ప్రకారం.. మల్టీబ్యాగర్ స్టాక్ లో మరో 2.32 శాతం వాటాను కొనుగోలు జరిగినట్లు వెల్లడైంది. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో ఈ డీల్ ద్వారా MIT 3,63,978 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.

 రాబడులు ఇలా..

రాబడులు ఇలా..

స్వాతంత్య్రానికి ముందుగా 1934లోనే ఈ కంపెనీ స్థాపించబడింది. గడచిన ఏడాది కాలంలో షేరు ఏకంగా 90 శాతం పెరిగింది. కరోనా తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో షేర్ 550 శాతం పెరిగింది. కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.903.80 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.365.50 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ డీల్ తర్వాత స్టాక్ గరిష్ఠాల వైపు ప్రయాణిస్తోంది.

English summary

Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్ లో పెట్టుబడి పెట్టిన అమెరికా సంస్థ.. డీల్ వివరాలు ఇలా | Massachusetts Institute of us bought multibagger Everest Industries shares

Massachusetts Institute of us bought multibagger Everest Industries shares
Story first published: Friday, October 14, 2022, 17:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X