దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆగస్టులో ఒక బహిరంగ ప్రకటనలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వెల్లడించిన సంగతి విదితమే. అయితే, సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. AX ప్లాట్‌ఫామ్ వినియోగదారుడు సోహమ్ సర్కార్..తన కళాశాల స్నేహితుడు గత 15 ఏళ్లుగా TCSలో పనిచేస్తున్న ఉద్యోగి చెప్పిన వివరాలను ఉటంకిస్తూ.. కంపెనీ దాదాపు 80 వేల మంది ఉద్యోగులను రాజీనామా చేయమని కోరిందని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ ప్రకారం కొంతమందికి 18 నెలల సెవరెన్స్ ప్యాకేజ్ ఇచ్చారని.. అలాగే మరికొంతమందికి మూడు నెలల జీతం చెల్లించారని తెలిపారు. మరికొందరికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదని సమాచారం వచ్చిందని పేర్కొన్నాడు.
అతని పోస్ట్‌కి స్పందించిన అనేక మంది వినియోగదారులు కూడా ఇలాంటి విషయాలను ధృవీకరించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. టీసీఎస్‌లో పనిచేసే నా స్నేహితుడి భార్య నుండి ఇలాంటి కథ విన్నాను. 80 వేల సంఖ్య ఖచ్చితంగా తెలియదు, కానీ సెవరెన్స్ ప్యాకేజీలు లేకుండా కూడా ఉద్యోగులను వదిలేస్తున్నారని చెప్పారు.

మరో నెటిజన్ మాట్లాడుతూ.. నా మేనేజర్ 25 ఏళ్ల సేవ తర్వాత VRS తీసుకోవలసి వచ్చింది. నా పొరుగువాడు 20 ఏళ్ల తర్వాత కంపెనీ నుండి బయటకు రావాలిసి వచ్చంది. ఇప్పటివరకు 40-50 వేల ఉద్యోగులు ప్రభావితమయ్యారని వినిపిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80 వేల ఉద్యోగాల కోత పుకార్లను టీసీఎస్ ప్రతినిధి ఖండించారు. కంపెనీ కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే వర్క్‌ఫోర్స్ సర్దుబాటు చేసిందని, భారీ సంఖ్యలో తొలగింపులు జరగలేదని తెలిపారు.
గత రెండేళ్లలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) వేగంగా అభివృద్ధి చెందింది. దీని ఫలితంగా కోడింగ్ వంటి అనేక వైట్ కాలర్ ఉద్యోగాలు ఆటోమేట్ అవుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం, ఈ మార్పులు ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు ఈ మార్పులను ఒక అవకాశంగా తీసుకోవాలంటున్నారు. వారు GenAIని ఉత్పాదకత సాధనంగా ఉపయోగించి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు.
గూగుల్ AI చీఫ్ డాక్టర్ జెఫ్ డీన్ 2024లో బెంగళూరులో జరిగిన Google Research ఈవెంట్‌లో మాట్లాడుతూ.. భారతదేశంలో అద్భుతమైన సాంకేతిక ప్రతిభ ఉంది. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు మెషిన్ లెర్నింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది భారతదేశానికి ప్రపంచస్థాయి అవకాశాలను తెస్తుందని అన్నారు. ఇక Perplexity AI CEO అరవింద్ శ్రీనివాస్ యువతకు సలహా ఇస్తూ.. GenAI నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సోషల్ మీడియా రీల్స్‌పై సమయం వృథా చేయకుండా, AIలో నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు
ఈ ఉద్యోగాల కోతల తీరుపై పలు ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Forum for IT Employees (FITE) కార్యదర్శి ప్రశాంత్ పండిట్ మాట్లాడుతూ.. TCSలో 30 ఏళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను 30 నిమిషాల్లోపు రాజీనామా చేయమని బలవంతపెడుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగులను సంస్థలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. Union of IT & ITES Employees (UNITE) జనరల్ సెక్రటరీ అలగునంబి వెల్కిన్ దీనిపై మాట్లాడుతూ.. కొత్త ప్రాజెక్టులకు కేటాయించబడినప్పటికీ, ఉద్యోగులను సెప్టెంబర్ చివరి వరకు బెంచ్ చేయడానికి ముందే నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నియమించబడిన ఉద్యోగులు అనేక మీటింగ్స్‌కు పిలవబడి మొదట కొత్త ప్రాజెక్టులను వెతకమని చెబుతారు. ప్రాజెక్ట్ దొరికినా, క్లయింట్ క్లియరెన్స్ వచ్చినా.. చివరికి RMG, HR ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తాయి. తరువాత వివిధ కారణాలు చూపుతూ వారిని రాజీనామా చేయమని ఒత్తిడి పెడుతున్నారని తెలిపారు.
రాజీనామా చేయకపోతే ఉద్యోగులను నేరుగా తొలగిస్తారు. అలా అయితే వారికి ఏ జీతం లభించదు. రాజీనామా చేసిన వారికి మాత్రమే మూడు నెలల నోటీసు పీరియడ్ జీతం, సెటిల్ మెంట్ ప్యాకేజీ లభిస్తుంది. ఈ ప్యాకేజీ ప్రకారం ఉద్యోగి చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల జీతం పరిహారంగా ఇస్తారు. అదనంగా ఉద్యోగులకు కెరీర్ అసెస్‌మెంట్, అవుట్‌ప్లేస్‌మెంట్ గైడెన్స్, కొన్ని మద్దతు సేవలు అందిస్తామని కంపెనీ చెబుతోందని ఆయన తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆరు నెలలపాటు కొనసాగుతుందని, అయితే దాని ప్రీమియం మొత్తాన్ని ఉద్యోగి స్వయంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications