Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ, విక్రయాల సంస్థగా ఉన్న మారుతీ సుజుకి నేడు తన కొత్త MPV ఇన్విక్టోను విపణలోకి విడుదల చేసింది. ఇది కార్ల ప్రియుల నుంచి భారీ ఆసక్తిని పొందింది.
మారుతీ సుజుకీ నేడు 7 సీటర్ Zeta+, 7 సీటర్ Aplha+, 8 సీటర్ Zeta+ వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధరలను రూ.24 లక్షల నుంచి రూ.29 లక్షల మధ్య ఉంటాయని వెల్లడించింది. మారుతి ఇన్విక్టో అనేది కంపెనీకి చెందిన NEXA సెగ్మెంట్‌లో ప్రవేశించిన 8వ కారు. అత్యుత్తమ మైలేజీని కూడా అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లలో లభ్యం కానుంది.

మారుతి ఇన్విక్టో మిడ్-వేరియంట్ Zeta+ (8-సీటర్) మోడల్ నెలవారీ EMI రూ.61,860తో అందుబాటులో ఉంది. ఈ కార్లు ఇప్పుడు నెక్సా షోరూమ్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ.25,000 చెల్లించటం ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకీ తొలిసారిగా రూ. 20 లక్షలకు పైగా ధర కలిగిన కొత్త కారును విడుదల చేయడం ద్వారా లగ్జరీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.
కిజాషి వైఫల్యం తర్వాత రూ.20 లక్షలకు మించిన ధరల శ్రేణిలో ఒక్క కారు కూడా విడుదల కాలేదు. కానీ ఇప్పుడు టయోటా సహాయం, మద్దతుతో హైబ్రిడ్ టెక్నాలజీ శక్తితో నడిచే కార్లను కంపెనీ రూ.28.42 లక్షల ధరతో విడుదల చేసింది. ఈ సందర్భంగా మారుతూ సుజుకీ షేర్లు నేడు 4 శాతం మేర లాభపడ్డాయి. దీంతో తొలిసారిగా కంపెనీ స్టాక్ రూ.10,000 మార్కును బీఎస్ఈలో అధిగమించి జీవితకాల శిఖరాన్ని తాకింది. నేటి ట్రేడింగ్ లో ముంబై స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో రూ.10,036.70కి చేరుకుంది.
2023లోనే మారుతీ సుజుకీ షేర్లు 18.88 శాతం మేర లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి మారుతీ సుజుకీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.55 శాతం రూ.3.02 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications