ఇండియా కార్ మేకర్ దిగ్గజం మారుతీ సుజుకీ చిన్న కార్లపై దృష్టి సారించింది. జనవరి నెలలో మారుతీ సుజుకీ ఉత్పత్తి తగ్గింది. 1,79,103 యూనిట్లను ఉత్పత్తి చేసింది. అంతకుముందు ఏడాది(2019)లో ఇదే జనవరిలో 183,064 యూనిట్లను ఉత్పత్తి చేసింది. అంటే గత ఏడాది కంటే 2.1 శాతం ఉత్పత్తి తగ్గింది. అయితే మారుతీ సుజుకీ చిన్న కార్ల ఉత్పత్తిని పెంచి, సెడాన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల ఉత్పత్తిని తగ్గించింది.
చిన్న కార్ల సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్ ప్రెస్పో వాటా 25.10 శఆతంగా ఉంది. అంటే 34,288 కార్లను ఈ జనవరిలో తయారు చేసింది. గత ఏడాది ఇదే సీజన్‌లో వీటి తయారీ 27,408గా ఉంది. కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్‌లోకి వచ్చే డిజైర్, స్విఫ్ట్, బాలినో, కొత్త వేగనార్ వంటి ఉత్పత్తి కూడా 6.31 శాతం పెరిగింది. అంతకుముందు ఏడాది వీటి ఉత్పత్తి 100,463 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 106,803 యూనిట్లుగా ఉంది.

విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, XL6, ఎస్ క్రాస్ వంటి మోడల్ ఉథ్పత్తిలో 37.33 శాతం తగ్గుదల కనిపించింది. ఈ కార్ల ఉత్పత్తి 20,062 యూనిట్లకే పరిమితమైంది. అంతకుముందు ఏడాది వీటి ఉత్పత్తి 32,015 యూనిట్లుగా ఉంది. మారుతీ వ్యాన్ కలిగిన ఎకో మోడల్ ఉత్పత్తిలో 9.78 శాతం తగ్గుదల ఉంది. గత ఏడాది 16,226 యూనిట్లు ఉత్పత్తి కాగా, ఇప్పుడు 14,639 యూనిట్లుగా ఉంది.
లైట్ కమర్షియల్ వెహికిల్స్ ఉత్పత్తి 45 శాతం తగ్గింది. గత ఏడాది జనవరిలో 4,605 కాగా, ఇప్పుడు 2,505కు పరిమితమయ్యాయి. సియాజ్ ఉత్పత్తులు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో 2347 యూనిట్లు కాగా, ఈసారి కేవలం 806 యూనిట్లకు పరిమితమైంది. వీటి సేల్స్ 65.65 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications