కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పరిశ్రమల ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక ఆటోమొబైల్ రంగం గురించి అయితే చెప్పక్కర్లేదు. జోన్లవారీగా విభజించి.. కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. కొన్ని పరిశ్రమలు క్రమంగా తెరచుకుంటున్నాయి. అయితే మారుతి సుజుకీకి చెందిన వితారా బ్రెజ్జా కార్లకు మాత్రం మామూలు క్రేజ్ లేదు. ఆర్థిక మాంద్యంలో కూడా ఆ కార్లు తమకు కావాలని 25 వేల మంది బుక్ చేసుకున్నారు.

25 వేల బుక్సింగ్స్..
మారుతీలో బ్రెజ్జాకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంది. బ్రెజ్జా కావాలని 25 వేల బుకింగ్స్ వచ్చాయంటే ఆ కారు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్రెజ్జా కారుకు మంచి టాక్ వచ్చి బుక్సింగ్ పెరిగే సమయంలో లాక్ డౌన్ వచ్చిందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంత్ శ్రీవాస్తవ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని బుకింగ్స్ వస్తాయని.. ఆశిస్తామని పేర్కొన్నారు.

మార్పులు...
వినియోగదారుల అభిరుచి మేరకు బ్రెజ్జా కారు ముందుభాగంలో కొన్ని మార్పులు (ఫేస్ లిఫ్ట్) చేశారు. దీంతోపాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో పెట్రోల్ ఇంజిన్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ డీజిల్ వేరియంట్ మాత్రం ఉత్పత్తిని నిలిపివేశారు. ఆధునీకరించిన బ్రెజ్జా కారులో కొత్త క్రోమ్ గ్రిల్, బంపర్ సవరించారు. హెడ్ ల్యాంప్ కూడా మోడిఫై చేశారు.

బీఎస్-6
ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైన్స్ కలిగి ఉంది. 16 ఇంచుల అలాయ్ వీల్స్ కలిగి ఉన్నాయి. వెనకాల కొత్త ఎల్ఈడీ ట్రైలైట్స్ కలిగి ఉన్నాయి. స్టీరింగ్ కూడా లెథర్‌తో నవీకరించి.. అందంగా రూపొందించారు. 7 అంగుళాల టంచ్ స్కీన్ వెనకాల వచ్చే వాహనాలను చూసేందుకు ఏర్పాటు చేశారు. కొత్త బ్రెజ్జా బీఎస్-6 ప్రమాణాలతో వస్తోంది. 1.5 లీటర్ కే సీరిస్‌తో ఎస్‌హెచ్‌వీఎస్ టెక్నాలజీతో వస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications