భారత అతిపెద్ద కారుమేకర్ మారుతీ సుజుకీ లాభాలు గతఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తగ్గాయి. ప్రాఫిట్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 9.7 శాతం క్షీణించింది. ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అంచనాల కంటే తక్కువగా ఉంది. అలాగే ఇతర ఆదాయాలు కూడా తగ్గాయి. కానీ రెవెన్యూ మాత్రం బాగుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో లాభం రూ.1,291.7 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,166.1 కోట్లుగా ఉంది.

తగ్గిన లాభం
ఆపరేషన్స్ ఆదాయం FY21 నాలుగో త్రైమాసికంలో రూ.24,023.7 కోట్లుగా నమోదయింది. FY20 నాలుగో త్రైమాసికంలో రూ.18,198.7 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. సేల్స్‌లో డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో రెవెన్యూ రూ.23,624 కోట్లుగా, ప్రాఫిట్ రూ.1,668 కోట్లుగా అంచనా వేశారు. కానీ రెవెన్యూ బలంగా ఉన్నప్పటికీ, ప్రాఫిట్ మాత్రం తగ్గింది. కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ఆటో సేల్స్ పడిపోయాయి. మూడో త్రైమాసికం నుండి క్రమంగా సేల్స్ పెరిగాయి.

గత ఏడాది లాక్ డౌన్ వల్ల
మారుతీ సుజుకీ మార్చి త్రైమాసికంలో 4,92,235 వాహనాలను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన ఇది 28 శాతం అధికం. డొమెస్టిక్ మార్కెట్ సేల్స్ 4,56,707 యూనిట్లు కాగా, ఈ వృద్ధి 26.7 శాతంగా ఉంది. ఎగుమతులు 35,528గా ఉన్నాయి. ఎగుమతులు 44.4 శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో FY20 సేల్స్ క్షీణించిన విషయాన్ని మారుతీ సుజుకీ గుర్తు చేసింది. అయితే కేవలం చివరి నెల చివరి వారంలో మాత్రమే ప్రభావం పడింది.

ఆపరేటింగ్ ఎబిటా
ఆపరేటింగ్ లెవల్ ఎబిటా ఏడాది ప్రాతిపదికన 28.8 శాతం పెరిగి రూ.1991.4 కోట్లుగా నమోదయింది. ప్రతికూల వస్తువుల ధరలు, ప్రతికూల విదేశీ మారక ద్రవ్యం హెచ్చుతగ్గులు, పెట్టుబడి మిగులుపై తక్కువ లాభాలు వంటివి మార్జిన్ పైన ప్రభావితం చేశాయి. అయితే మెరుగైన సామర్థ్య వినియోగం, తక్కువ అమ్మకాల ప్రమోషన్ ఖర్చులు, అమ్మకు ధరల పెరుగుదల, వ్యయ తగ్గింపు అంశాలు కాస్త కలిసి వచ్చాయి.


Click it and Unblock the Notifications