ఎంపిక చేసిన మోడల్స్ పైన ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ కస్టమర్లకు బంపరాఫర్ ఇచ్చింది. ఈ మార్చికే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. రూ.67,000 వరకు తక్కువకు వివిధ మోడల్స్ కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ ద్వారా రూ.20,000, కార్పోరేట్ డిస్కౌంట్ ద్వారా మరో రూ.10,000 తక్కువకు వస్తుంది. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కారు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని మారుతీ సుజుకీ తెలిపింది.

ఆఫర్ల వెల్లువ
ఎర్టిగా మినహా ఎంట్రీ లెవల్ ఆల్టో నుంచి విటారా బ్రెజా వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ ఆఫర్ల ద్వారా తమ విక్రయాలు పెంచుకోవడం తమ లక్ష్యమని మారుతి సుజుకి తెలిపింది. ఈ డిస్కౌంట్స్ ఒక్కో నగరానికి ఒకలా ఉంటాయని కూడా స్పష్టం చేసింది. కార్ల కొనుగోలుదారులు కంపెనీ అందించే ఆఫర్లను తమ తమ సమీపంలోని షోరూంలకు వెళ్లి తెలుసుకోవచ్చు. వివిధ మోడల్స్ పైన వేలాది రూపాయల తగ్గింపు వర్తిస్తుంది.

ఈ మోడల్స్ పైన తగ్గింపు
మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో మోడల్‌పై రూ.52,000 వరకు, సెలారియోపై రూ.47,000 వరకు తగ్గింపు, ఆల్టో మోడల్‌పై రూ.42,000 వరకు తగ్గింపు,
ఎకో మోడల్‌పై రూ.37,000 వరకు తగ్గింపు, స్విఫ్ట్ మోడల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు, విటారా బ్రెజ్జా మోడల్‌పై రూ.35,000 వరకు తగ్గింపు, డిజైర్ మోడల్‌పై రూ.35,000 వరకు తగ్గింపు, వాగన్ ఆర్ మోడల్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ఉంది.

ఎక్స్చేంజ్ ఆఫర్, డిస్కౌంట్
మారుతీ ఎకో మోడల్ పైన రూ.10వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20వేలతో కలిపి రూ.37వేల వరకు రాయితీ అందుబాటులో ఉంది. మారుతీ స్విఫ్ట్ పైన క్యాష్ డిస్కౌంట్ రూ.10వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.20వేలు లభిస్తుంది. ఆల్టో పైన రూ.15వేలు డిస్కౌంట్ ఆఫర్, ఎక్స్చేంజ్ బోనస్ రూ.15వేలు లభిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications