దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి. ఇండియా లో అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ కంపెనీదే ఉంటుంది. కానీ ప్రభుత్వం మార్చిన కాలుష్య నిబంధనల కారణంగా మారుతి సుజుకి కి కొత్త తలనొప్పి తయారయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశంలో తయారయ్యే అన్ని రకాల కార్లు బిఎస్ - 6 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. అలాంటి కార్లనే విక్రయించాలి. ఇందుకు అనుగుణంగా మారుతి సుజుకి ఆ సమయానికల్లా డీజిల్ మోడల్ కార్లను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని భావించింది. ఇందుకు అనుగుణంగా వేగంగా చర్యలు చేపట్టింది.
ఎందుకంటే చిన్న మోడల్స్ డీజిల్ ఇంజిన్ల ను కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయటం కష్టమని కంపెనీ యోచిస్తోంది. కానీ ఇక్కడే మారుతికి కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే కార్లలో డీజిల్ విభాగం వాటా చాలా అధికంగానే ఉంది. ఒకవేళ ఈ విభాగానికి స్వస్తి పలికితే.... అది పోటీ కంపెనీలకు కలిసొస్తుందని మారుతి ఆందోళన చెందుతోంది. అందుకే తన ప్రణాళికల్లో మళ్ళీ కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

ఏడాది విరామం...
ఇప్పటికే డీజిల్ కార్లను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్న మారుతి సుజుకి... ప్రభుత్వ నియమాల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందే తన అన్ని డీజిల్ మోడల్స్ విక్రయాలను నిలిపి వేయనుందని సమాచారం. ఇందులో భాగంగా ముందుగా సియాజ్ మోడల్ నుంచి మొదలు పెట్టి... క్రమంగా ఎర్టిగా, ఎస్ క్రాస్ మోడల్స్ ను నిలిపివేయనుంది. ఆ తర్వాత విటారా బ్రేజా, బాలెనొ, స్విఫ్ట్, డిజైర్ వాహనాల్లోనూ డీజిల్ మోడల్స్ కు గుడ్ బై చెప్పనుంది. అయితే, ఈ అన్ని రకాల మోడల్స్ లోనూ ప్రత్యామ్నాయంగా సిఎన్ జి వేరియంట్లను ఆఫర్ చేయబోతోంది. ఇదిలా ఉండగా 2020 ఏప్రిల్ నుంచి మారుతి సుజుకి డీజిల్ కార్ల కు స్వల్ప విరామం ఇచ్చి... మళ్ళీ 2021 నుంచి ఈ విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది.

సొంతంగా ఇంజన్ల ఉత్పత్తి...
చాలా కాలంగా మారుతి సుజుకి తన చిన్న తరహా డీజిల్ ఇంజన్ల కోసం ఇటలీ కంపెనీ ఫియట్ పై ఆధారపడుతోంది. కానీ ఫియట్ ప్రస్తుతం కొత్త నిభందనలకు అనుగుణంగా ఇంజన్ల ఉత్పత్తి చేయలేక పోతుండటంతో ... మారుతి నే స్వయంగా 1.5 లీటర్ల సామర్త్యం తో డీజిల్ ఇంజన్ల ను ఉత్పత్తి చేయాలనీ సంకల్పించింది. ఇందుకోసం టొయోట కంపెనీ తో కలిసి పనిచేయబోతోంది. ఇప్పటి వరకు మారుతి ఫియట్ కు సంబంధించిన 1.3 లీటర్ల డీజిల్ ఇంజిన్లని వినియోగించేది. 1.5 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ ఇంజన్ల ను తయారు చేస్తే... ఇకపై మారుతి కూడా ఈ విభాగంలో తమ పోటీదారులైన టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా లకి మళ్ళీ పోటీ ఇవ్వగలుగుతుంది.

5,00,000 డీజిల్ కార్లు...
మారుతి సుజుకి సగటున దేశంలో నెలకు సుమారు 1,00,000 కార్లను విక్రయిస్తుంది. ఏడాదికి 12,00,000 కార్లను వినియోగదారులకు అందజేస్తుంది. ఇందులో 2018-19 సంవత్సరంలో ఏకంగా 5,00,000 డీజిల్ కార్లను విక్రయించింది. కాగా ఈ ఏడాది డీజిల్ కార్ల సంఖ్య దాదాపు సగం తగ్గే అవకాశం ఉందని మారుతి అంచనా వేస్తోంది. భారత దేశం లోని మొత్తం డీజిల్ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి వాటా సుమారు 40% ఉంటుంది. అందుకే, ఈ విభానికి స్వస్తి పలికితే మొత్తంగా తన అమ్మకాలు దెబ్బతింటాయని మారుతి భావిస్తోంది. అది కచ్చితంగా పోటీదారులకు కలిసొచ్చే అంశమేనని ఆందోళన చెందుతోంది.

వాళ్ళకి డీజిల్ మోడల్స్...
మారుతి సుజుకి గట్టి పోటీ నిచ్ఛే హ్యుండై మోటార్స్ తన అన్ని రకాల డీజిల్ ఇంజన్లను ప్రభుత్వ కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తోంది. దీంతో ఈ కంపెనీ కి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. అదే సమయంలో టాటా మోటార్స్, మహీంద్రా, హోండా కంపెనీ లు కూడా తమ డీజిల్ మోడల్ కార్లను యధావిధిగా బీఎస్ - 6 నిబంధనల ప్రకారం తయారు చేసి విక్రయించనున్నాయి. ఇదే అంశం ప్రస్తుతం మారుతి సుజుకి కి ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. కాగా వోక్స్ వాగన్, రెనాల్ట్ భాగస్వామ్య కంపెనీ డీజిల్ కార్లపై స్పష్టత లేదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications