Maruti Suzuki Q2 Results: దేశంలో అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా నేడు తన క్యూ2 ఫలితాలను విడుదల చేసింది. కార్ల కంపెనీ తన సూపర్ లాభాలతో ఇన్వెస్టర్లలో జోష్ పెంచింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.3,716.5 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ.2,061 కోట్ల కంటే 80.28% ఎక్కువగా నమోదైంది. పెరిగిన నాన్-ఆపరేటింగ్ ఆదాయం, తక్కువ కమోడిటీ ధరలు, మెరుగైన నికర అమ్మకాలు, ఖర్చు తగ్గించే కార్యక్రమాలు దాని నికర లాభం పెరగడానికి ప్రధాన డ్రైవింగ్ కారణాలుగా కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో హైలైట్ చేసింది. క్యూ2లో కంపెనీ స్వతంత్ర ఆదాయం 23.8% వృద్ధి చెంది రూ.37,062.1 కోట్లకు చేరుకుంది .

ఈ త్రైమాసికంలో మారుతీ ఇండియా 5,52,055 వాహనాలు విక్రయించింది. దేశీయంగా 4,82,731 వాహనాలు విక్రయించబడ్డాయి. 69,324 కార్లు ఎగుమతి చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు మొత్తం 5,17,395 యూనిట్లను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన EBITDA మార్జిన్ 360 బేసిస్ పాయింట్లు పెరిగి 12.9%కి చేరుకుంది. మారుతీ సుజుకి షేర్ ధర బలమైన Q2 ఆదాయాల తర్వాత దాదాపు 3% లాభపడింది. సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.10,560.70గా ఉంది.
కంపెనీ బలమైన సెప్టెంబర్ ఫలితాలతో బ్రోకరేజ్ కంపెనీలు సైతం షేర్ ధరపై తమ సానుకూలతను ప్రకటిస్తున్నాయి. మారుతీ షేర్లపై ఏంజెల్ వన్ ఈక్విటీ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్, రాజేష్ భోసలే తన టెక్నికల్ వ్యూ వెల్లడించారు. సమీప కాలంలో షేర్ ధర రూ.11,000 మార్కును తాకుతుందన్నారు. అలాగే టెక్నికల్ గా రూ.10,500 స్థాయి వద్ద మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications