కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాహన కంపెనీలు దెబ్బతిన్నాయి. కరోనా సమయంలో సేల్స్ లేకపోవడంతో పాటు సెమీ కండక్టర్స్ షార్టేజ్, మెటల్ ధరలు పెరగడం సహా వివిధ అంశాలు ప్రభావం చూపాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ఆటో కంపెనీలు వాహన ధరలను పెంచుతున్నాయి. భారత ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ కూడా వాహనాల ధరలను పెంచుతోంది. ఈ కంపెనీ ఈ సంవత్సరం ధరలు పెంచడం మూడోసారి.
స్విఫ్ట్ కారుతో పాటు ఇతర కార్ల సీఎన్జీ వేరియంట్స్ ధరలు రూ.15,000 వరకు పెంచినట్లు మారుతి సుజుకి తెలిపింది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లనే ఈ కార్ల ధరలు పెంచవలసి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ ధరలు తక్షణం అమలులోకి వచ్చాయని తెలిపింది.

స్విఫ్ట్ కారు పైన రూ.15,000 పెరుగుతోంది. సీఎన్జీ మోడల్స్ పైన రూ.10,000 పెరుగుతోంది. ఇతర మోడల్స్ ధరలను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో మారుతీ సుజుకీ కార్లు, ఎస్‌యూవీ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఏ మోడల్ పైన ఎంత?
జూలై నెలలో ధరలు పెరిగిన తర్వాత వివిధ మారుతీ సుజుకీ మోడల్స్ ధరలు ఇలా ఉన్నాయి.... స్విఫ్ట్ రూ.15000, ఆల్టో 800 (సీఎన్జీ) రూ.10,000, ఎస్-ప్రెస్సో (సీఎన్జీ) రూ.10,000, వాగన్-ఆర్ (సీఎన్జీ) రూ.10,000, సెలెరియో (సీఎన్జీ) రూ.10,000, ఈకో (సీఎన్జీ) రూ.10,000, సూపర్ క్యారీ (సీఎన్జీ) రూ.10,000, ఎర్టిగా (సీఎన్జీ) రూ.10,000, డిజైర్ టూర్స్ (సీఎన్జీ) రూ.10,000 భారం కానున్నాయి.


Click it and Unblock the Notifications