For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Maruti Suzuki: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? మారుతీ అందిస్తున్న ఆఫర్స్ మిస్ కాకండి..

|

Maruti Suzuki: దీపావళి పండుగకు సహజంగా మనలో చాలా మంది కొత్త కార్లు, బైక్స్, గృహోపకరణాలు లాంటివి కొంటుంటాం. కంపెనీలు సైతం పండుగ సేల్స్ పెంచుకునేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాగే ఈ పండుగల సీజన్‌లో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన సుజుకి ఎస్-ప్రెస్సో, డిజైర్, సెలెరియో, స్విఫ్ట్, ఆల్టో, వ్యాగనర్ మోడళ్లపై తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

 మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో..

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో..

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో మాన్యువల్ వేరియంట్ కార్లపై కంపెనీ ఏకంగా రూ.56,000 వరకు తగ్గింపును ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న మెుత్తం తగ్గింపులో రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.6,000 కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి. S ప్రెస్సో AMGపై రూ.46,000 వరకు ఆఫర్ ప్రకటించబడింది.

డిజైర్..

డిజైర్..

మారుతి సుజుకి డిజైర్ మోడల్ కార్లపై రూ.52,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది. ఇందులో రూ.35,000 తగ్గింపు, రూ.7,000 కార్పొరేట్ బోనస్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రకటించింది.

 సెలెరియో..

సెలెరియో..

మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వెర్షన్‌లపై మొత్తం రూ.51,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.6,000 కార్పొరేట్ తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అదనంగా సెలెరియో CNG మోడల్ కారు కొనుగోలుపై మరో రూ.10,000 తగ్గింపు అందించబడుతోంది.

 స్విఫ్ట్..

స్విఫ్ట్..

మారుతి సుజుకి స్విఫ్ట్ AMG కారును కొనుగోలు చేసేందుకు రూ.47,000 ఆఫర్‌ను ప్రకటించింది. మాన్యువల్ మోడల్ కారు కొనుగోలుపై రూ.30,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

ఆల్టో K10..

ఆల్టో K10..

మారుతి సుజుకి ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్‌పై రూ.39,000 తగ్గింపును కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.17,000 నగదు తగ్గింపు మగిలిన రూ.7,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించబడుతుంది.

ఆల్టో 800..

ఆల్టో 800..

మారుతి సుజుకి ఆల్టో 800పై రూ.36,000 తగ్గింపు అందుబాటులో ఉంది. కనిష్ఠంగా రూ.11,000 నుంచి గరిష్ఠంగా రూ.36,000 వరకు రాయితీ అందుబాటులో ఉంది.

వ్యాగనార్..

వ్యాగనార్..

మారుతి సుజుకి వ్యాగనార్ పై రూ.15,000 తగ్గింపు ఉంది. సీఎన్‌జీ కారుపై అదనంగా రూ.5,000తో మొత్తం రూ.31,000 తగ్గుదల ఉంటుందని ప్రకటించింది. వాహనాలపై మారుతి సుజుకి అందిస్తున్న ఈ ప్రత్యేక తగ్గింపులు కేవలం అక్టోబర్ పండుగ నెల వరకు మాత్రమేనని తెలుస్తోంది.

English summary

Maruti Suzuki: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? మారుతీ అందిస్తున్న ఆఫర్స్ మిస్ కాకండి.. | Maruti Suzuki giving mega discounts on all car models one eve of diwali 2022

Maruti Suzuki giving mega discounts on all car models one eve of diwali 2022
Story first published: Thursday, October 13, 2022, 16:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X