కరిగిపోతున్న కొత్త కారు కల.. బడ్జెట్ ముందే మారుతీ పక్కా ప్లాన్.. కస్టమర్లకి షాక్
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ పైనే అన్ని రంగాలు దృష్టి సారించాయి. ఎ రంగానికి ఎలాంటి కేటాయింపుల నుండి ఎలాంటి మినహాయింపులు కల్పిస్తారు అని ఎదురు చూస్తున్నారు. మరో పక్క ఆటోమొబైల్ రంగంలో టాప్ లో ఉన్న కంపెనీ బడ్జెట్ ముందే కీలక ప్రకటన చేసింది. మారుతీ సుజుకి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని అగ్రగామిగా ఉన్నప్పటికీ, తాజగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల లిస్టులో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్న మారుతీ కంపెనీని టాటా పంచ్ అధిగమించింది. ఇంత కీలక పరిస్థితిలో కారు కొనుగోలుదారుని షాక్ చేసేలా మారుతీ ఒక ప్రకటన చేసింది.
మారుతీ సుజుకి 1 ఫిబ్రవరి 2025 నుండి కంపెనీ తయారు చేసే అన్ని వాహనాలపై ధరల పెంపును ప్రకటించింది. దీనికి సంబంధించి మారుతీ సుజుకీ విడుదల చేసిన ప్రకటనలో ఉత్పత్తి ఖర్చులు ఇంకా నిర్వహణ ఖర్చులు పెరగడంతో మా కార్ల ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ తెలిపింది.

"మా మేనేజ్‌మెంట్ ఖర్చు తగ్గింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ, పెరిగిన ఖర్చులలో కొంత భాగాన్ని మా కస్టమర్‌లపై బదిలీ చేయవలసి వస్తుంది" అని కంపెనీ తెలిపింది. అలాగే కాంపాక్ట్ సెలెరియో ధరను రూ. 32,500 వరకు పెంచడంతో పాటు ధరల పెంపు మోడల్ బట్టి మారుతుంటుందని వెల్లడించింది. ఇక ప్రీమియం ఇన్విక్టో మోడల్ ధర కూడా రూ.30 వేల వరకు పెరగనుంది. వ్యాగన్-ఆర్ అలాగే స్విఫ్ట్ వంటి ఇతర ప్రముఖ చిన్న మోడల్‌లు ధరలు వరుసగా రూ. 15,000 అలాగే రూ. 5,000 వరకు పెరగనుంది. బ్రెజ్జా అలాగే గ్రాండ్ విటారా వంటి SUVల ధరలు కూడా రూ. 20 వేల నుండి రూ. 25 వేల వరకు ధరలను పెంచనుంది.
ఆల్టో కె10 అండ్ ఎస్-ప్రెసో వంటి బేస్ మోడల్‌ల ధరలు వరుసగా రూ. 19,500 అలాగే రూ. 5,000 వరకు పెరుగనుంది. ప్రీమియం కాంపాక్ట్ బాలెనో ధర రూ. 9 వేలు పెరగనుండగా, ఫ్రాంక్స్ ఇంకా డిజైర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు అలాగే సెడాన్‌ల ధరలు వరుసగా రూ. 5,500 నుండి రూ. 10,000 వరకు పెరగనున్నాయి. చివరగా మారుతి సుజుకి ప్రస్తుతం రూ. 3.99 లక్షల నుండి ప్రారంభమయ్యే కార్ల నుండి ప్రీమియం ఇన్విక్టో కార్ల వరకు దీని ధర రూ. 28.92 లక్షలకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు) అనేక రకాల వాహనాలను అందిస్తోంది. ఇక ఆటోమొబైల్ రంగంలో ఈ ఏడాది ధరల పెంపు ప్రకటించిన మొదటి కంపెనీగా మారుతీ అవతరించింది.


Click it and Unblock the Notifications