దేశీయ ప్రముఖ కార్ మేకర్ మారుతీ సుజుకీ వాహన సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రాంను మరో రెండు నగరాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ స్కీం దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు హైదరాబాద్, పుణే నగరాలకు విస్తరించింది. ఈ స్కీంలో కారును నేరుగా కొనుగోలు చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెల నిర్వహణ ఛార్జీల కింద కొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఈ స్కీం అమలు కోసం జపాన్ ఒరిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

హైదరాబాద్ సహా నాలుగు నగరాలకు
మారుతీ సుజుకీ సబ్‌స్క్రిప్షన్ స్కీం మూడు నెలల క్రితం ప్రారంభమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాల్లో తొలుత ప్రారంభించింది. ఇప్పుడు మరో రెండు నగరాలకు విస్తరించడం ద్వారా మొత్తం 4 నగరాలకు విస్తరించింది. కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేయకుండానే నెలవారీ ఎక్స్‌క్లూజివ్ ఫీజును చెల్లించి ఉపయోగించుకోవచ్చు. నెలవారీ కొంతమొత్తం చెల్లిస్తే మిగతా అంశాలు కంపెనీయే చూసుకుంటుంది.

ఈ కార్లపై స్కీం
ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తే, కారు నిర్వహణ, ఇన్సురెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్ వంటివి కంపెనీ చూసుకుంటుంది. వీటితో కలిపి నెలవారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, బాలెనో, సియాజ్, XL6 తదితర కారు మోడల్స్ పైన ఈ స్కీం అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌లో కనిష్ట ధర
మారుతీ సుజకీ ఈ కార్ల ఆఫర్లను 24 నెలలు, 36 నెలలు, 48 నెలల కాలానికి అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ కనిష్ట స్కీం ధర స్విఫ్ట్ LXi పైన ఉంది. ఈ కారు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర హైదరాబాద్‌లో రూ.15,479, పుణేలో రూ.15,354 ఉంది. రానున్న రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా 40 నుండి 60 పట్టణాల్లో దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

మంచి స్పందన
ఈ కారును కస్టమర్ పేరుపై రిజిస్టర్ చేస్తారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సురెన్స్ కలిపి ఛార్జీ వసూలు చేస్తారు. ప్యాకేజీలో భాగంగా మెయింటెనెన్స్, 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంది. ఇండివిడ్యువల్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా దీనిని తీసుకు వచ్చారు. కస్టమర్ అనుకూల కాలపరిమితి, జీరో డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ ఉంటాయి. ఈ స్కీంకు సంబంధించి కస్టమర్ల నుండి మంచి స్పందన వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications