మారుతీ సుజుకీ షాకిచ్చింది. స్విఫ్ట్, సెలెరియో మినహా మిగిలిన కార్ల ధరలను రూ.22,500 వరకు పెంచింది. పెరిగిన ముడి సరుకు వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ మోడల్స్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలో 1.6 శాతం వరకు పెంపు ఉంటుందని తెలిపింది. శుక్రవారం నుండి ధరల పెంపు అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ ఏడాదిలో మారుతి సుజుకి కార్ల ధరలను పెంచడం రెండోసారి. అంటే జనవరి నెల నుండి ఇప్పుడు పెంచడం రెండోసారి. ఎంపిక చేసిన మోడల్ కార్లపై సగటున రూ.34 వేల చొప్పున పెరిగాయి. స్టీల్ వంటి ముడి సరుకు, గ్లోబల్ కమోడిటీ ధరలు నిలకడగా పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ కాస్త భారంగా మారింది. అలాగే గ్లోబల్ మార్కెట్లో సెమీ కండక్టర్స్ కొరత అధిక వ్యయానికి కారణంగా మారింది.

జనవరి నెలలో మారుతీ సుజుకీ తన ఆల్టో, ఎస్ ప్రెస్సో పైన రూ.34,000 వరకు పెంచాయి. మారుతీ సుజుకీ దేశంలో 14 మోడల్స్‌ను విక్రయిస్తోంది. మారుతీ సుజుకీతో పాటు ఇతర వాహన కంపెనీలు కూడా ధరలను పెంచాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications