సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ వాహన కంపెనీ మారుతీ సుజుకీ లాభం 65 శాతం మేర తగ్గింది. ఇప్పటికీ 2 లక్షల వాహనాల ఆర్డర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. నెట్ సేల్స్ 9 శాతం పెరిగాయి. మారుతీ సుజుకీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.487 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికం లాభం రూ.1420 కోట్లతో పోలిస్తే ఇది 66 శాతం తక్కువ. చిప్స్ కొరతతో పాటు కమోడిటీ ధరలు పెరగడం వల్ల లాభం తగ్గినట్లు తెలిపింది. కార్యకలాపాల ఏకీకృత ఆధాయం రూ.18,756 కోట్ల నుండి రూ.20,551 కోట్లకు చేరుకుంది.
మొత్తం వాహన విక్రయాలు 3,93,130 నుండి 3,79,541కు తగ్గాయి. దేశీయ విక్రయాలు 3,70,619 నుండి 3,20,133కు క్షీణించాయి. కంపెనీ చరిత్రలో అత్యధికంగా ఓ త్రైమాసికంలో 59,408 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇది 22,511గా ఉంది. ఎలక్ట్రానిక్ చిప్స్ కొరతతో సమీక్ష త్రైమాసికంలో 1.16 లక్షల వాహనాల ఉత్పత్తిని మారుతీ సుజుకీ తగ్గించింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగులో ఉన్నాయి.

2025 తర్వాత విద్యుత్ వాహనాలను(ఎలక్ట్రానిక్ వెహికిల్స్) విడుదల చేస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. నెలకు కనీసం 10,000 విద్యుత్ వాహనాలను విక్రయించే పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈ విభాగంలోకి అడుగులు వేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్జీ మోడల్స్‌కు డిమాండ్ పెరిగిందని, వీటి ఉత్పత్తి పెంపుపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. నవంబర్ నెలలో వాహన ఉత్పత్తి పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications