For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవే

|

గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో మారుతీకి చెందిన స్విఫ్ట్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు మారుతీ సుజుకీ మంగళవారం వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో బాలెనో, వ్యాగన్ఆర్, ఆల్టో, డిజైర్ ఉన్నాయి. ఈ ఐదు మోడల్స్ వరుసగా నాలుగో ఏడాది స్థిరమైన విక్రయాలు నమోదు చేశాయని తెలిపింది. 1.72 లక్షల కార్ల విక్రయాలతో స్విఫ్ట్ మోడల్ మొదటి స్థానంలో నిలిచింది. 2020-21లో సేల్ అయిన పాసింజర్ వెహికిల్స్‌లో ఈ మోడళ్ల వాటా 30 శాతమని మారుతీ తెలిపింది.

మైక్రోసాఫ్ట్ భారీ డీల్, 20 బిలియన్లకు AI న్యూఆన్స్ కొనుగోలుమైక్రోసాఫ్ట్ భారీ డీల్, 20 బిలియన్లకు AI న్యూఆన్స్ కొనుగోలు

మారుతీ అదుర్స్

మారుతీ అదుర్స్

తమ కస్టమర్లు తమపై ఉంచిన విశ్వాసం స్థిరంగా ఉందని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, (మార్కెటింగ్, సేల్స్) శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. 2017-18 నుండి ఈ 5 మోడల్స్ అత్యధికంగా అమ్ముడవుతోన్న జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఉంటున్నాయి. 2020-21లో అత్యధికంగా అమ్ముడుపోయిన 10 మోడల్స్‌లో మారుతీ సుజుకీ కంపెనీవే ఏడు ఉండటం గమనార్హం. స్విఫ్ట్ 1.72 లక్షలు, బాలెనో 1.63 లక్షలు, వ్యాగన్ ఆర్ 1.59 లక్షలు, డిజైర్ 1.28 లక్షలతో టాప్ 5లో ఉన్నాయి.

పదిహేనేళ్లయినా..

పదిహేనేళ్లయినా..

మారుతీ స్విఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చి పదిహేనేళ్లవుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ సేల్స్‌లో దూసుకెళ్తోంది. మారుతీ సుజుకీ ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిస్ట్‌ను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్ అఫ్ లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) లభిస్తోంది. 2021 మారుతీ సుజుకీ స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్ జెన్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది.

35 శాతం వాటా దీనిదే

35 శాతం వాటా దీనిదే

మారుతీ సుజుకీ ఇండియా సేల్స్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతోన్న టాప్ 5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్‌లో 35 శాతం వాటా దీనిదే కావడం గమనార్హం. మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 శాతం నుండి 9 శాతం మధ్య వెహికిల్ లోన్ అందించడం కూడా కారు సేల్స్ పెరగడానికి కొంత దోహదపడ్డాయి.

English summary

వరుసగా 4వ ఏడాది: మారుతీ దూకుడు, అత్యధికంగా అమ్మడైన 5 కార్లు ఇవే | Maruti cars dominate top five sales list in India for fourth consecutive year

Maruti Suzuki has a solid grip in the passenger vehicle segment in the country with all the top-five selling cars in FY 2020-21 coming from its garage.
Story first published: Wednesday, April 14, 2021, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X