HDFC ట్విన్స్ విలీనం, కార్పోరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనం
కార్పోరేట్ చరిత్రలోనే అతిపెద్ద విలీనం! మోర్టగేజ్ రుణ సంస్థ HDFC లిమిటెడ్, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకు లిమిటెడ్ విలీనం కానున్నాయి. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం లభించినట్లు HDFC లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. HDFC అనుబంధ సంస్థలైన HDFC ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, HDFC హోల్డింగ్స్ లిమిటెడ్, HDFC బ్యాంకు లిమిటెడ్ విలీనం కానున్నాయి. దీనికి సెబి, సీసీఐ, ఆర్బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లభించాలి.
2023-24 ఆర్థిక సంవత్సరం లేదా మూడో త్రైమాసికం నాటికి ఈ విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. HDFC బ్యాంకులో HDFCకి 41 శాతం ఉంది. ప్రతి 25 HDFC లిమిటెడ్ షేర్లకు 42 HDFC బ్యాంకు లిమిటెడ్ షేర్లు లభిస్తాయి. సెన్సెక్స్, నిఫ్టీ పరుగులో ఎక్కువ పాత్ర HDFC ట్విన్స్‌దే. మధ్యాహ్నం గం.11.45 సమయానికి HDFC లిమిటెడ్ స్టాక్ 10.74 శాతం లాభపడి రూ.2715 వద్ద, HDFC బ్యాంకు షేర్ 8.82 శాతం ఎగిసి 1638.80 వద్ద ట్రేడ్ అయింది.

మార్కెట్ వ్యాల్యూ పరంగా విలీనం అనంతరం HDFC మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఈ రెండు బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.8 లక్షల కోట్లుగా ఉండవచ్చు. ప్రస్తుతం HDFC బ్యాంకు లిమిటెడ్ మార్కెట్ క్యాప్ 8.3 లక్షల కోట్లు, HDFC మార్కెట్ క్యాప్ 4.44 లక్షల కోట్లుగా ఉంది. విలీనం తర్వాత నిఫ్టీ50లో వెయిటేజీపరంగా HDFC బ్యాంకు అతిపెద్ద స్టాక్‌గా నిలుస్తుంది. మార్చి 31 నాటికి HDFC బ్యాంకు వెయిటేజీ 8.4 శాతం, HDFC వెయిటేజీ 5.66 శాతంగా ఉంది. రిలయన్స్ వెంయిటేజీ ప్రస్తుతం 11.9 శాతం కాగా, దీనిని దాటేయవచ్చు.


Click it and Unblock the Notifications