Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం భారీ ఒడిదొడుకుల్లో నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాలు సైతం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటం కొంత పరిస్థితులను దిగజార్చింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 314 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 93 పాయింట్ల మేర క్షీణతను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 309 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 17 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. అయితే ఇంట్రాడేలో నష్టాలను తగ్గించటంలో ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు కీలకంగా వ్యవహరించాయి.

ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, సిప్లా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, ఓఎన్జీసీ, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, టీసీఎస్, రిలయన్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications